Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఎన్నికల సంఘం తీరుపై కాంగ్రెస్ ఆగ్రహం.. నారాయణఖేడ్‌లో భారీ ధర్నా దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 08, 2026 06:39 PM

ఎన్నికల సంఘం తీరుపై కాంగ్రెస్ ఆగ్రహం.. నారాయణఖేడ్‌లో భారీ ధర్నా

08-10-2026 48 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అరెస్టును నిరసిస్తూ ఏఐసీసీ, పీసీసీ పిలుపు మేరకు నారాయణఖేడ్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, మహాధర్నా నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు,

మున్సిపల్ చైర్మన్ నగేష్ కుమార్ షేట్కార్, పీసీసీ సభ్యులు కే శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.ముందుగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం, ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి స్వగృహం నుంచి రాజీవ్ గాంధీ చౌరస్తా వరకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు.అనంతరం చౌరస్తా వద్ద కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నినాదాలు చేస్తూ మహాధర్నా చేపట్టారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఓటర్ల జాబితా సవరణలో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత పాటించాలని, ఎన్నికల సంఘం తీరును మార్చుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ చేస్తున్న పోరాటానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. అవసరమైతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మండల, పట్టణ నాయకులు, కౌన్సిలర్లు, సర్పంచులు, యూత్ కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

ఎన్నికల సంఘం తీరుపై కాంగ్రెస్ ఆగ్రహం.. నారాయణఖేడ్‌లో భారీ ధర్నా

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News