Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఎన్నికల సంఘం తీరుపై కాంగ్రెస్ ఆగ్రహం.. నారాయణఖేడ్‌లో భారీ ధర్నా దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 08, 2026 06:37 PM

విద్యుత్‌ కోతలపై తెలుగుదేశం పార్టీ గర్జన.. రైతుల పంటలు కాపాడే వరకు పోరాటం!

08-10-2026 11 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

విద్యుత్‌ కోతలతో రైతుల పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ఆరోపిస్తూ తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం కోదాడ సబ్‌స్టేషన్‌ ఎదుట రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేయాలని డిమాండ్‌ చేస్తూ మహాధర్నా నిర్వహించారు.వ్యవసాయానికి విద్యుత్‌ సరఫరాలో తరచూ అంతరాయాలు ఏర్పడటంతో పొలాల్లో వరి పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పంట చేతికొచ్చే దశలో విద్యుత్‌ కోతలతో రైతులను నష్టాలపాలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతుల సమస్యలను తక్షణమే పరిష్కరించకుండా కాలయాపన చేస్తే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని టీడీపీ నాయకులు హెచ్చరించారు.అనంతరం ఏఈ, ఏడీ అధికారులను కలిసి వినతిపత్రం అందజేశారు. ఎండిపోతున్న పంటలను కాపాడేందుకు తక్షణమే విద్యుత్‌ సరఫరాను క్రమబద్ధీకరించాలని, రైతులకు న్యాయం చేయాలని కోరారు. సమస్యను వెంటనే పరిష్కరించకపోతే రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని టీడీపీ నాయకులు స్పష్టం చేశారు.

Sthanikam

విద్యుత్‌ కోతలపై తెలుగుదేశం పార్టీ గర్జన.. రైతుల పంటలు కాపాడే వరకు పోరాటం!

Article Image

విద్యుత్‌ కోతలతో రైతుల పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ఆరోపిస్తూ తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం కోదాడ సబ్‌స్టేషన్‌ ఎదుట రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేయాలని డిమాండ్‌ చేస్తూ మహాధర్నా నిర్వహించారు.వ్యవసాయానికి విద్యుత్‌ సరఫరాలో తరచూ అంతరాయాలు ఏర్పడటంతో పొలాల్లో వరి పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పంట చేతికొచ్చే దశలో విద్యుత్‌ కోతలతో రైతులను నష్టాలపాలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతుల సమస్యలను తక్షణమే పరిష్కరించకుండా కాలయాపన చేస్తే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని టీడీపీ నాయకులు హెచ్చరించారు.అనంతరం ఏఈ, ఏడీ అధికారులను కలిసి వినతిపత్రం అందజేశారు. ఎండిపోతున్న పంటలను కాపాడేందుకు తక్షణమే విద్యుత్‌ సరఫరాను క్రమబద్ధీకరించాలని, రైతులకు న్యాయం చేయాలని కోరారు. సమస్యను వెంటనే పరిష్కరించకపోతే రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని టీడీపీ నాయకులు స్పష్టం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News