Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఎన్నికల సంఘం తీరుపై కాంగ్రెస్ ఆగ్రహం.. నారాయణఖేడ్‌లో భారీ ధర్నా దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 08, 2026 06:35 PM

విద్యాసంస్థల ప్రతినిధులకు కొత్త బాధ్యతలు

08-10-2026 77 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ (ట్రస్మా) రామన్నపేట మండల నూతన కమిటీని గురువారం జరిగిన సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ట్రస్మా జిల్లా అధ్యక్షుడు పాలకుర్ల వెంకటేశం సమక్షంలో నిర్వహించిన సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు.

మండల కమిటీ గౌరవ సలహాదారుగా తిరుగుల మల్లికార్జున్ (వివేకానంద స్కూల్), గౌరవ అధ్యక్షుడిగా గంగుల నరేందర్‌రెడ్డి (కృష్ణవేణి టాలెంట్ స్కూల్), అధ్యక్షుడిగా జె.ఎస్. మార్టిన్ (మదర్ థెరిసా స్కూల్), వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కనకాచారి (చైతన్య విద్యాలయం, ఇంద్రపాలనగరం), ప్రధాన కార్యదర్శిగా నకిరేకంటి నాగరాజు (నాగార్జున స్కూల్), కోశాధికారిగా కె. శ్రీధర్ (పల్లవి స్కూల్) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

అనంతరం నూతన కమిటీ సభ్యులను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ప్రైవేట్ పాఠశాలల సమస్యల పరిష్కారానికి, విద్యా ప్రమాణాల పెంపునకు నూతన కమిటీ సమన్వయంతో పనిచేయాలని పలువురు ఆకాంక్షించారు.

కార్యక్రమంలో ట్రస్మా జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి శ్రీరాములు, జిల్లా గౌరవ అధ్యక్షుడు మెరుగు మధు, జిల్లా నాయకులు మిర్యాల దుర్గాప్రసాద్, కాసుల వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

విద్యాసంస్థల ప్రతినిధులకు కొత్త బాధ్యతలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News