జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్ ఆదేశాల మేరకు సంగారెడ్డి ట్రాఫిక్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ రామకృష్ణ ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి సీపీఆర్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డా. శశికర్ సీపీఆర్ చేసే విధానం, దాని ప్రాధాన్యతను సిబ్బందికి వివరించారు. గుండెపోటు, రోడ్డు ప్రమాదాలు లేదా ఇతర అత్యవసర పరిస్థితుల్లో బాధితుడి శ్వాస ఆగిపోయినప్పుడు వైద్య సాయం అందేలోపు ప్రాణాలను కాపాడేందుకు సీపీఆర్ ఎలా చేయాలో ప్రాథమిక శిక్షణ ఇచ్చారు. అత్యవసర సమయంలో బాధితుడి పరిస్థితిని గుర్తించి వెంటనే స్పందించడం, వైద్య సాయం కోసం సమాచారం అందించడం, అప్పటివరకు ప్రాథమిక ప్రాణరక్షణ చర్యలు చేపట్టడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. విధి నిర్వహణలో పోలీసులు రోడ్డు ప్రమాదాలు, ఇతర అత్యవసర పరిస్థితులను తరచూ ఎదుర్కొనే అవకాశం ఉన్నందున ప్రతి పోలీసు సిబ్బందికి ప్రాణరక్షణ నైపుణ్యాలపై అవగాహన అవసరమని ఎస్పీ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఐలు సాయిలు, రాములు, గోపి చౌహాన్‌తో పాటు ట్రాఫిక్ సిబ్బంది, డబ్ల్యూపీఎస్ ఇన్‌స్పెక్టర్ మహేష్, ఎస్‌ఐ పూలాబాయి, సిబ్బంది పాల్గొని సీపీఆర్ శిక్షణ పొందారు.
ఆపదలో ఆపన్నహస్తం.. ప్రాణాలు కాపాడే సీపీఆర్‌పై పోలీసులకు శిక్షణ

Krishna

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి