రాహుల్, ప్రియాంక గాంధీల అక్రమ అరెస్టులు, లాఠీచార్జ్‌కు వ్యతిరేకంగా మిన్నంటిన నినాదాలు
ఓటు చోరీకి పాల్పడుతున్న కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) తీరును నిరసిస్తూ, పార్లమెంట్ ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో పాటు ‘ఇండియా’ కూటమి నేతల అక్రమ అరెస్టులు, లాఠీచార్జ్‌లకు వ్యతిరేకంగా చౌటుప్పల్‌లో కాంగ్రెస్ శ్రేణులు భారీ ధర్నా నిర్వహించాయి. కాంగ్రెస్ బ్లాక్ అధ్యక్షులు ఆకుల ఇంద్రసేనారెడ్డి, మండల అధ్యక్షులు బోయే దేవేందర్, మున్సిపాలిటీ అధ్యక్షులు కాసర్ల శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలో ఈ నిరసన కార్యక్రమం జరిగింది.ఢిల్లీలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ చేపడుతున్న పోరాటానికి మద్దతుగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీ సర్కార్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే వరకు పోరాటం ఆపేది లేదని నాయకులు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో పి ఎ సి ఎస్ చైర్మన్ మస్తాన్ బాబు యాదవ్, వైస్ చైర్మన్ శివారెడ్డి, జిల్లా కార్యదర్శి చింతల సాయిలు, మాజీ అధ్యక్షులు బక్క శ్రీనాథ్, సుర్వి నరసింహ గౌడ్, రిక్కల మహేందర్ రెడ్డి, కౌన్సిలర్ పాక చిరంజీవి, బద్రి గాలయ్య, పస్తం గంగరాములు, మీసాల నరసింహ, పిన్నింటి శ్రీనివాస్ రెడ్డి, గడ్డం సత్తయ్య, బొబ్బిలి రాజేందర్, దుబ్బాక ఆకాష్ రెడ్డి, బండమీది ఎల్లయ్య, కొరగోని లింగస్వామి, వీరమల్ల సత్తయ్య, బోడిగే బాలకృష్ణ, మాదాని గోపాల్, వర్కాల వెంకటేష్, వెంకట్ కుమార్, రవికాంత్ రెడ్డి, కరెంటు శంకర్ నాయక్, జక్కడి వెంకట్ రెడ్డి, చెక్క మల్లయ్య, మేకల దేవేందర్ రెడ్డి, లందగిరి యాదయ్య, బుడుగు వెంకటేశం, పోలోజు శ్రీనివాస్ చారి, నరసింహ, మాదాని ఎల్లప్ప, ఎండి ఎజాస్ పాషా, పాశం కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి