సంగారెడ్డి నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌ను కోరారు. గురువారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ను కలిసిన ఎమ్మెల్యే నియోజకవర్గంలోని పెండింగ్ అభివృద్ధి పనులు, రైతుల విద్యుత్ సమస్యలు, తాగునీటి కొరత, మౌలిక వసతులపై చర్చించారు. రైతులకు కనీసం 8 గంటల విద్యుత్ కూడా సక్రమంగా అందడం లేదని, దీంతో సాగు పనులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. విద్యుత్ సరఫరాను మెరుగుపరిచి రైతుల సమస్యను త్వరగా పరిష్కరించాలని కోరారు. అలాగే తాగునీటి సమస్య ఉన్న గ్రామాలను గుర్తించి ప్రజలకు ట్యాంకర్ల ద్వారా నీటిని అందించాలని, పరిశ్రమల నీటి సరఫరా కంటే ప్రజల తాగునీటి అవసరాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అవసరమైన ప్రాంతాల్లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భవనాలను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. గతంలో ఎమ్మెల్యే చేసిన విజ్ఞప్తి మేరకు తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్న అత్యవసర గ్రామాల్లో రూ.21.50 లక్షల వ్యయంతో బోర్‌వెల్స్ మంజూరు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని ఎమ్మెల్యే కోరారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ పాండు, మండల పార్టీ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రైతుల విద్యుత్, ప్రజల తాగునీటి సమస్యలు పరిష్కరించాలి: ఎమ్మెల్యే చింతా ప్రభాకర్

Krishna

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి