Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సేవలోనే స్మరణ.. మల్లేశం గౌడ్ వర్ధంతి సందర్భంగా వృద్ధులకు అన్నదానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 07, 2026 08:18 PM

సేవలోనే స్మరణ.. మల్లేశం గౌడ్ వర్ధంతి సందర్భంగా వృద్ధులకు అన్నదానం

07-10-2026 11 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

వనస్థలిపురం, అక్టోబర్ 7:

దివంగత బడేటి మల్లేశం గౌడ్ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన కుటుంబ సభ్యులు సేవా కార్యక్రమం నిర్వహించారు. వనస్థలిపురంలోని ‘రెడీ టు సర్వ్ ఫౌండేషన్’ వృద్ధాశ్రమంలో బుధవారం మల్లేశం గౌడ్ నాల్గవ వర్ధంతి సందర్భంగా ఆశ్రమంలోని వృద్ధులకు అన్నదానం చేశారు.

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని తంగడపల్లి గ్రామానికి చెందిన మల్లేశం గౌడ్ చిత్రపటానికి ఆశ్రమంలోని వృద్ధులు, సిబ్బంది పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యుల సౌజన్యంతో వృద్ధులకు భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా వృద్ధాశ్రమ నిర్వాహకులు పెద్ది శంకర్ మాట్లాడుతూ.. మల్లేశం గౌడ్ వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు వృద్ధులకు అన్నదానం చేయడం అభినందనీయమన్నారు. ఆపన్నులను ఆదుకోవాలనే సేవా భావం సమాజానికి ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. మల్లేశం గౌడ్ కుటుంబ సభ్యులపై భగవంతుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.

కార్యక్రమంలో ఆశ్రమ సిబ్బందితో పాటు పెద్ద సంఖ్యలో వృద్ధులు పాల్గొన్నారు.

Sthanikam

సేవలోనే స్మరణ.. మల్లేశం గౌడ్ వర్ధంతి సందర్భంగా వృద్ధులకు అన్నదానం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News