సైబర్ జాగృకత దివస్ సందర్భంగా సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఎం.ఎన్.ఆర్. యూనివర్సిటీ విద్యార్థులకు డిజిటల్ చెల్లింపులు, ఆన్‌లైన్ షాపింగ్, డిజిటల్ అరెస్ట్, పెట్టుబడులు, ఉద్యోగాలు, రుణ యాప్‌ల పేరుతో జరిగే సైబర్ మోసాలపై జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ అవగాహన కల్పించారు. ప్రస్తుత కాలంలో సైబర్ నేరాలు పెరుగుతున్నందున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.తెలియని వ్యక్తులు పంపే లింకులను తెరవకూడదని, ఓటీపీ, పిన్, సీవీవీ, పాస్‌వర్డ్, యూపీఐ పిన్ వంటి రహస్య వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దని తెలిపారు. ఆన్‌లైన్‌లో ఆకర్షణీయమైన ఆఫర్లు, భారీ తగ్గింపుల పేరుతో వచ్చే నకిలీ వెబ్‌సైట్లను నమ్మవద్దని, తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు వస్తాయని చెప్పే అనుమానాస్పద పెట్టుబడుల పట్ల జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. పోలీసులు, సీబీఐ, కస్టమ్స్ లేదా ఇతర ప్రభుత్వ అధికారుల పేరుతో ఫోన్ చేసి కేసులు, అరెస్టుల పేరుతో భయపెట్టి డబ్బులు అడిగితే నమ్మవద్దని స్పష్టం చేశారు. సైబర్ మోసానికి గురైన వెంటనే 1930కు సమాచారం అందించాలని, www.cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలని సూచించారు. ప్రతి ఒక్కరూ “ఆగండి.. ఆలోచించండి.. ధృవీకరించండి” అనే సూత్రాన్ని పాటిస్తూ సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ కోరారు. ఈ కార్యక్రమంలో సైబర్ సెల్ డీఎస్పీ వేణుగోపాల్ రెడ్డి, ఎం.ఎన్.ఆర్. యూనివర్సిటీ ఉపకులపతి కృష్ణ చలం, రిజిస్ట్రార్ రాజేశ్వరన్, ఎన్.ఆర్. క్యాంపస్ డిప్యూటీ డైరెక్టర్ గిరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
డిజిటల్ మోసాల పట్ల జాగ్రత్త.. విద్యార్థులకు ఎస్పీ అవగాహన

Krishna

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి