Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:36 PM

బీసీల అభ్యున్నతికి పూలే ఆశయాలే మార్గం: పెనుగొండలో జయంతి సభ

11-04-2026 68 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

పెనుగొండ పట్టణంలోని వాసవి కళ్యాణమండపంలో బీసీ కుల సంఘాల ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతరావు పూలె జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమం ప్రారంభంలో పూలే గారి చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నేతలు, సభ్యులు నివాళులు అర్పించారు.

సభలో ప్రసంగించిన నాయకులు పూలే గారు సామాజిక న్యాయం, విద్యా విస్తరణ కోసం చేసిన సేవలను స్మరించుకున్నారు. బీసీల అభ్యున్నతికి ఆయన చూపిన మార్గం నేటికీ ఆదర్శమని పేర్కొన్నారు. సమాజంలోని అట్టడుగు వర్గాల సంక్షేమం కోసం ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు.

అలాగే బీసీలకు స్థానిక సంస్థల నుండి శాసనసభల వరకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని, జనాభా ప్రాతిపదికన హక్కులు అమలు చేయాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. స్వాతంత్ర్యం వచ్చిన ఎన్నో సంవత్సరాలు గడిచినా బీసీలకు న్యాయం పూర్తిస్థాయిలో అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

భవిష్యత్తులో నియోజకవర్గం, జిల్లా స్థాయిలో విస్తృత సమావేశాలు నిర్వహించి బీసీల హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాటం కొనసాగించాలని నిర్ణయించారు.

ఈ కార్యక్రమంలో శ్రీరాములు యాదవ్, కోనాపురం ఈశ్వరయ్య, డ్వాక్రా రామాంజనేయులు, కురబ అశ్వర్థ నారాయణ, జయచంద్ర, కురబ నంజుండ, బోయ నంజుండ, మంగళ రామాంజనేయులు, బుడబుక్కల నరసింహులు, ఈశ్వరయ్య, వెంకటేశులు, బోయ చెనరాయుడు, బోయ రాము తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

బీసీల అభ్యున్నతికి పూలే ఆశయాలే మార్గం: పెనుగొండలో జయంతి సభ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News