Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:27 AM

బీజేపీ విభజన రాజకీయాలను తిప్పికొట్టాలి. సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం.డి. జహంగీర్

22-04-2026 38 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

బీజేపీ అవలంబిస్తున్న విభజన రాజకీయాలను దేశ ప్రజలు తిప్పికొట్టాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం.డి. జహంగీర్ పిలుపునిచ్చారు. పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు వ్యతిరేకించింది మహిళా బిల్లును కాదని, ఏకపక్షంగా తీసుకొస్తున్న నియోజకవర్గాల పునర్విభజన విధానాన్నేనని స్పష్టం చేశారు.

కమ్యూనిస్టు నేత వ్లాదిమిర్ లెనిన్ 156వ జయంతి సందర్భంగా స్థానిక సిపిఎం కార్యాలయంలో “మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్—వంచనలు, వాస్తవాలు” అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. ఉత్తరాది రాష్ట్రాలకు లబ్ధి చేకూరేలా, దక్షిణాది రాష్ట్రాలను ద్వితీయ శ్రేణిగా మార్చే కుట్ర జరుగుతోందని ఆరోపించారు.

మహిళా రిజర్వేషన్ పేరిట ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ బీజేపీ రాజకీయ లాభాలు పొందాలని చూస్తోందన్నారు. కుటుంబ నియంత్రణ పాటించిన రాష్ట్రాలకు సీట్లు తగ్గించడం అన్యాయమని ప్రశ్నించారు. డీలిమిటేషన్ అమలు అయితే దక్షిణాది రాష్ట్రాల భవిష్యత్‌పై ప్రభావం పడుతుందని హెచ్చరించారు.

33 శాతం మహిళా రిజర్వేషన్ యథాతథంగా అమలు చేయాలని, విభజన రాజకీయాలకు ప్రజలు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.

సదస్సుకు ఏభూషి నర్సింహ అధ్యక్షత వహించగా, సిపిఎం నాయకులు మేక అశోక్ రెడ్డి, జల్లెల పెంటయ్య, బొడ్డుపల్లి వెంకటేశం, బల్గూరి అంజయ్య, వనం ఉపేందర్, జంపాల అండాలు, కందుల హనుమంతు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

బీజేపీ విభజన రాజకీయాలను తిప్పికొట్టాలి. సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం.డి. జహంగీర్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News