Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:16 AM

బీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు

బీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు

బీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు
27-04-2026 104 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కోదాడ మండల పరిధిలోని అల్వాలపురం గ్రామంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ చింతా కవిత రాదారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె పార్టీ జెండాను ఎగురవేసి శ్రేణులకు శుభాకాంక్షలు తెలియజేసి మిఠాయిలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆశయాలకు ప్రతిరూపంగా సమానత్వం, అభివృద్ధి, సంక్షేమ లక్ష్యాలతో ప్రారంభమైన బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిందన్నారు. రైతు బంధు, రైతు బీమా, కాళేశ్వరం వంటి పథకాల ద్వారా ప్రజల సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో పార్టీ అంకితభావంతో పనిచేసిందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలకు బీఆర్‌ఎస్ పార్టీపై విశ్వాసం ఉందని, మళ్లీ కెసీఆర్ పాలన రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

బీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News