Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం 10వ తరగతి మెమో పోగొట్టుకున్న యువకుడు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం తల్లికి వందనం అలర్ట్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 05:02 PM

బయోఫ్లాక్ విధానంలో చేపల సాగుపై 3 రోజుల శిక్షణా కార్యక్రమం ప్రారంభం

బయోఫ్లాక్ విధానంలో చేపల సాగుపై 3 రోజుల శిక్షణా కార్యక్రమం ప్రారంభం

బయోఫ్లాక్ విధానంలో చేపల సాగుపై 3 రోజుల శిక్షణా కార్యక్రమం ప్రారంభం
March 05, 2026 07:46 PM 32 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పాలేరు: మత్స్య పరిశోధన స్థానం పాలేరు, పి.వి. నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో “బయోఫ్లాక్ విధానంలో చేపల సాగు” అంశంపై మూడు రోజుల నైపుణ్యాభివృద్ధి శిక్షణా కార్యక్రమం విజయవంతంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి భారతీయ వ్యవసాయ మరియు గ్రామీణాభివృద్ధి బ్యాంక్ (నాబార్డ్), వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ఆర్థిక సహకారం అందిస్తున్నాయి.

ఈ శిక్షణా కార్యక్రమానికి ఖమ్మం, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల (NAF), భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హైదరాబాద్ మరియు సూర్యాపేట జిల్లాల నుంచి 25 మంది మత్స్య రైతులు, మత్స్యకారులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన పాలేరు సర్పంచ్ బానోతు నాగేశ్వరావు నాయక్ మాట్లాడుతూ తెలంగాణ మత్స్య రైతులు ఆక్వాకల్చర్ రంగంలో ముందుకు రావడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సబ్సిడీ పథకాలతో పాటు బ్యాంకుల ద్వారా లభించే వివిధ రకాల రుణ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

యంగ్ ప్రొఫెషనల్ కందూరి అరుణ్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా మరియు దేశవ్యాప్తంగా బయోఫ్లాక్ విధానంలో చేపల సాగు పరిస్థితుల గురించి మత్స్య రైతులకు వివరించారు. మత్స్య శాస్త్రవేత్త బి. రవీందర్ బయోఫ్లాక్ విధానంలో పెంచదగిన చేపల రకాలపై అవగాహన కల్పించారు.

అదేవిధంగా పాలేరు మత్స్య పరిశోధన స్థానంలోని చేప పిల్లల హేచరీ యూనిట్, బయోఫ్లాక్ ట్యాంకులు, సమీకృత కోళ్లు–చేపల పెంపకం, సమీకృత గొర్రెలు–చేపల పెంపకం, సమీకృత చేపలు–వరి సాగు మరియు వివిధ రకాల అలంకరణ చేపల పెంపకం విధానాలను క్షేత్రస్థాయిలో వివరించారు.

మత్స్య శాస్త్రవేత్త పి. శాంతన్న బయోఫ్లాక్ విధానంలో చేపల సాగు చేపట్టేటప్పుడు స్థల ఎంపిక, ఫ్లాక్ తయారీకి అవసరమైన ముడి పదార్థాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మేత యొక్క పోషక విలువలు మరియు మేత యాజమాన్యంపై మత్స్య రైతులకు వివరించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News