Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:02 PM

బరిలో కత్తి తగిలి పందెం కోడికి తెగిపోయిన భుజం ఎముక

18-03-2026 34 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

ఆర్థోపెడిక్ సర్జరీ ద్వారా ఎముకకి రాడ్ వేసి అతికించిన అసిస్టెంట్ డైరెక్టర్

మేళ్లచెర్వు మండల కేంద్రానికి చెందిన పందెం కోడి యజమాని మొన్న తన కోడి పుంజును బరిలో దింపగా అవతలి కోడిపుంజు విసిరిన కత్తి దెబ్బకి కోడి పుంజు భుజం ఎముక ( రెక్క ఎముక) తెగి రెండుగా విడిపోయింది . అసలే కోళ్ళంటే పిచ్చి, అందులోనూ పౌరుషాలకు ప్రతిరూపమైన పందెం కోడి అంటే మహాపిచ్చి. విరిగిన రెక్కను ఎలాగైనా కాపాడుకోవాలనే తపనతో వైద్యంకోసం నిన్న మేళ్లచెర్వు వెళ్లగా కోడిపుంజును కోదాడ తీసుకువెళ్లాలని అక్కడి సిబ్బంది సూచించడం తో , కోసుకొని తినే కోడే కదా అన్న చిన్న చూపు లేకుండా తనకు నచ్చిన ప్రాణానికి ఎలాగైనా తిరిగి రెక్కను అందించాలనే పెద్ద మనస్సుతో యజమాని ఈరోజు కోడిపుంజుని కోదాడ పట్టణం ప్రాంతీయ పశువైద్యశాలకు తీసుకు వచ్చారు.

రెక్క విరిగిన కోడి పుంజును పరీక్షించిన అసిస్టెంట్ డైరెక్టర్ డా పి పెంటయ్య, బొక్క విరిగి రెండు రోజులు కావడం తో తెగిన కండ, బొక్కలు ఇన్ఫెక్షన్ సోకి ఉండగా , గాయాలను శుభ్రపరచి రక్త ప్రసరణ జరిగేలా కొత్త పండును తయారు చేసి ఆర్థోపెడిక్ సర్జరీ ద్వారా విరిగిన ఎముకలను రాడ్ వేసి అతికించి, గాయాన్ని కుట్లతో మూసి వేసి విజయవంతంగా శస్త్ర చికిత్స పూర్తిచేశారు. అనంతరం అంతవరకూ రెక్క వేలాడేసి తిరిగిన కోడి రాడ్ వేశాక రెక్కను ఆడిస్తూ నిటారుగా లేచి తిరగడం తో యజమాని సంతోషం వ్యక్తం చేస్తూ ఉదయం దవాఖానకి వస్తే ఉదయం నుండి నందిగామ, గడ్డిపల్లి, మునగాల, హుజూరాబాద్ నగర్ తదితర ప్రాంతాల నుండి వచ్చిన జంతువులకు ఆపరేషన్స్ పూర్తి అయ్యేసరికి మధ్యాహ్నం నాలుగున్నరకి కానీ నావంతు రాలేదని, దూడకి పొట్టలో కణితి, కుక్కకి గర్భాశయ కాన్సర్ కణితి కుక్కలో చెవి ఇన్ఫెక్షన్ తదితర ఆపరేషన్లు వరుసగా చేసి కూడా నా కోడికి ఆపరేషన్ చేయడం చూశాక నేను ఉదయం నుండి నా వంతుకోసం ఎదురు చూసిన అలసట అంతా మర్చిపోయానని అన్నారు యజమాని. చికిత్సలో సిబ్బంది రాజు, చంద్రకళ పాల్గొన్నారు.

Sthanikam

బరిలో కత్తి తగిలి పందెం కోడికి తెగిపోయిన భుజం ఎముక

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News