Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:26 AM

బ్రహ్మోత్సవాల్లో స్థానిక కళాకారులకు అవకాశం ఇవ్వాలి: సిపిఐ

21-04-2026 31 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే,బీర్ల ఐలయ్యకు వినతి

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాలలో తెలంగాణ ప్రజానాట్యమండలి స్థానిక కళాకారులకు ప్రదర్శనలలో అవకాశం కల్పించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి కోరారు.ఈ మేరకు సిపిఐ ప్రతినిధి బృందం ఆలేరు ఎమ్మెల్యే,ప్రభుత్వ విప్, బీర్ల ఐలయ్యకు వినతి పత్రం సమర్పించింది.ఈ సందర్భంగా దామోదర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజానాట్యమండలి కళాకారులు సమాజ సమస్యలను ప్రతిబింబిస్తూ ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్నారని తెలిపారు.అలాంటి కళాకారులకు బ్రహ్మోత్సవాల వేదికపై అవకాశాలు కల్పిస్తే సంప్రదాయ కళలకు ప్రోత్సాహం లభిస్తుందని అన్నారు.యాదగిరిగుట్ట కొండపై ఉన్న స్థానిక సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా,వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.కళాకారుల కోసం గుర్తింపు కార్డులు,హెల్త్ కార్డులు ఇవ్వడం,కోలాట మరియు జానపద కళాబృందాలకు సబ్సిడీ రుణాలు కల్పించడం,ప్రతి కళాకారునికి నెలకు ఆరు వేల రూపాయల పెన్షన్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి చెక్క వెంకటేష్,సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బోలగాని సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

బ్రహ్మోత్సవాల్లో స్థానిక కళాకారులకు అవకాశం ఇవ్వాలి: సిపిఐ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News