Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 12:24 AM

బ్లాక్ టీచింగ్ లేక బీఈడీ కాలేజీల దందా చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు తప్పవు: డీఎస్ఎఫ్

25-02-2026 35 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కర్నూలు: బ్లాక్ టీచింగ్ నిర్వహించకుండా బీఈడీ కాలేజీలను నడుపుతున్న యాజమాన్యాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని డెమొక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ (డీఎస్ఎఫ్) డిమాండ్ చేసింది. ఈ మేరకు సంఘం ప్రతినిధులు రాయలసీమ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ వి. వెంకట బసవరావును కలిసి వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా డీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ధనాపురం ఉదయ్ మాట్లాడుతూ… సౌకర్యాలు లేని, నిబంధనలు పాటించని కాలేజీలకు గుర్తింపు కొనసాగించడం సమంజసం కాదన్నారు. బ్లాక్ టీచింగ్ నిర్వహించకుండా విద్యార్థులను పరీక్షలకు పంపించడం తీవ్ర అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు.

కొన్ని బీఈడీ కాలేజీలు విద్యా ప్రమాణాలను పక్కనపెట్టి ధనార్జనే ధ్యేయంగా నడుస్తున్నాయని ఆరోపించారు. వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులను దోపిడీ చేస్తున్నారన్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడే యాజమాన్యాలపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

డిమాండ్లను పరిగణలోకి తీసుకోకపోతే రానున్న రోజుల్లో పెద్దఎత్తున కాలేజీల ముందు ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

ఈ విషయంపై వైస్ చాన్స్‌లర్ వి. వెంకట బసవరావు స్పందిస్తూ… బ్లాక్ టీచింగ్ నిర్వహించని కాలేజీలపై విచారణ జరిపించి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.

Sthanikam

బ్లాక్ టీచింగ్ లేక బీఈడీ కాలేజీల దందా చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు తప్పవు: డీఎస్ఎఫ్

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News