Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కనకదుర్గ అమ్మవారి ఆలయంలో నేడు వైభవంగా పుష్పాభిషేకం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 03, 2026 09:27 PM

బెదిరింపులకు భయపడేది లేదు.. టీవీఏఈ జేఏసీ

16-04-2026 216 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

ప్రభుత్వం దిగివచ్చే వరకు పోరాటం ఆగదు ..

9వ రోజుకు చేరిన టీవీఏఈ జేఏసీ సమ్మె కొనసాగుతున్న అర్థనగ్న ప్రదర్శనలు..

నల్లగొండ : తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ టీవీఏఈ జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చేపట్టిన నిరవధిక సమ్మె గురువారం నాటికి తొమ్మిదో రోజుకు చేరుకుంది. కార్మికుల సమస్యలపై సానుకూలంగా స్పందించాల్సిన ప్రభుత్వం మరియు యాజమాన్యం, వారిని విధుల్లోంచి తొలగిస్తామంటూ భయభ్రాంతులకు గురిచేయడాన్ని కార్మిక నేతలు తీవ్రంగా ఖండించారు. యాజమాన్యం అనుసరిస్తున్న ఇటువంటి మొండి వైఖరిపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ బెదిరింపులకు తలొగ్గకుండా భారీ సంఖ్యలో తరలివచ్చి తొమ్మిదో రోజు దీక్షను విజయవంతం చేశారు.

ఈ క్రమంలో బుధవారం యాజమాన్యంతో జేఏసీ జరిపిన చర్చలు విఫలం కావడంతో తీవ్ర మనస్తాపానికి గురైన కార్మికుడు గోడ కొమ్మలు గుండెపోటుతో మరణించడం సమ్మె శిబిరంలో విషాదాన్ని నింపింది. మృతి చెందిన కార్మికుడి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ సమ్మెలో పాల్గొన్న వారంతా రెండు నిమిషాల పాటు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం తమ నిరసనను ఉధృతం చేస్తూ 12 మంది కార్మికులు అర్థనగ్న ప్రదర్శన చేపట్టి ఒకరోజు నిరాహార దీక్షకు దిగారు. కార్మికుల పోరాటానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి నేడు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. కార్మికులకు రావలసిన న్యాయమైన డిమాండ్ల సాధనలో తమ పార్టీ తరఫున పూర్తి సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు జిట్టబోయిన లింగస్వామి, నాయకులు లింగారెడ్డి, పెరుమాళ్ల మురళి, విశ్వం, వేణుగోపాల్ రెడ్డి, బొప్పాని యాదయ్య, గణేష్, అద్దంకి వెంకన్న, పోతపాక విజయ్ కుమార్, కోటి, విజయ్ రెడ్డి, పరమేష్, ఉపేందర్, రమేష్, వెంకన్న, లచ్చిరెడ్డి, వెంకట్ రెడ్డి, పెరిక శేఖర్, రఫియా, ప్రసన్నకుమార్, అరుణ, లక్ష్మి, శైలజ, రాజేష్, మైల సైదులు, నాగమణి, కరుణ, కళావతి, ఆరీఫా, భారతి, నాగార్జున తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

బెదిరింపులకు భయపడేది లేదు.. టీవీఏఈ జేఏసీ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News