Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కనకదుర్గ అమ్మవారి ఆలయంలో నేడు వైభవంగా పుష్పాభిషేకం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 04, 2026 06:27 AM

అవినీతి బయటపడుతుందనే భయంతోనే 'స్టే'లు!

అవినీతి బయటపడుతుందనే భయంతోనే 'స్టే'లు!

అవినీతి బయటపడుతుందనే భయంతోనే 'స్టే'లు!
22-04-2026 40 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

కాళేశ్వరం వైఫల్యాలకు బీఆర్ఎస్ బాధ్యత వహించాలి..

కేసుకు స్టే వస్తే గెలిచినట్లు గోబెల్స్ ప్రచారం పై ప్రభుత్వ విప్ వేముల వీరేశం ధ్వజం..

నకిరేకల్ : కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన భారీ అవినీతి, నిర్మాణ లోపాలు ఎక్కడ బయటపడతాయోనన్న భయంతోనే బీఆర్ఎస్ నాయకులు కోర్టులను ఆశ్రయించి స్టేలు తెచ్చుకుంటున్నారని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం విమర్శించారు. బుధవారం నకిరేకల్‌లోని తన క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రాజెక్టు వైఫల్యాలపై నిజాలు నిగ్గు తేల్చేందుకు నియమించిన పీసీ ఘోష్ కమిషన్‌ను మొదటి నుంచీ బీఆర్ఎస్ అడ్డుకుంటోందని, తమ తప్పులు ఎక్కడ దొరికిపోతాయోనన్న ఆందోళన వారిలో స్పష్టంగా కనిపిస్తోందని మండిపడ్డారు.​ కోర్టు తీర్పును బీఆర్ఎస్ నాయకులు తమకు అనుకూలంగా వక్రీకరించుకుంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని వీరేశం ధ్వజమెత్తారు.

పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా కొన్ని సాంకేతిక అంశాలపై మాత్రమే చర్యలు తీసుకోవద్దని హైకోర్టు సూచించిందని అంతేకానీ కేసు మొత్తం గెలిచినట్లు కాదని ఆయన స్పష్టం చేశారు. స్టేలు తెచ్చుకుని తాము నిర్దోషులమని చెప్పుకోవడం అంటే తెలంగాణ ప్రజలను మరోసారి మోసం చేయడమేనని అసలు దొంగలెవరో రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన నాణ్యత లోపాల కారణంగా వేలాది కోట్ల రూపాయల ప్రజాధనం వృథా అయ్యిందని, దీనికి పూర్తి బాధ్యత గత ప్రభుత్వానిదేనని ఆయన పేర్కొన్నారు. ఈ కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అవసరమైతే సీబీఐ దర్యాప్తు కూడా చేపడుతుందని స్పష్టం చేశారు. ఈ అవినీతిలో ఎవరెవరి పాత్ర ఉందో వారందరిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గతంలో ప్రధాని మోదీ, అమిత్ షా వంటి వారు సైతం కాళేశ్వరాన్ని ఏటీఎంలా వాడుకున్నారని విమర్శించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం కూడా తమ వైఖరిని స్పష్టంగా తెలియజేయాల్సిన అవసరం ఉందని కోరారు. పదేళ్లపాటు అధికారంలో ఉండి దోచుకున్న బీఆర్ఎస్ జిల్లా నాయకులు ఇప్పుడు అహంకారంతో మాట్లాడటం విడ్డూరంగా ఉందని వీరేశం విమర్శించారు. సూర్యాపేట మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతోనైనా అక్కడి నాయకులకు జ్ఞానోదయం కావాల్సిందని కానీ వారి ప్రవర్తనలో మార్పు రావడం లేదని అన్నారు. కేవలం కమిషన్ల కోసమే ప్రాజెక్టులు కట్టి ప్రజల సొమ్మును దోచుకున్నారనేది తెలంగాణ సమాజం మొత్తం నమ్ముతోందని నిజాలు వెలుగులోకి వచ్చే వరకు తమ ప్రభుత్వం విశ్రమించబోదని ఆయన తేల్చి చెప్పారు.

Sthanikam

అవినీతి బయటపడుతుందనే భయంతోనే 'స్టే'లు!

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News