Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గడువులోగా ఎస్‌ఐఆర్‌ పూర్తి చేయాలని.. అదనపు సమయం పనిచేసిన రెవెన్యూ సిబ్బంది దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:12 AM

అశ్వారావుపేటలో ఆధార పార్టీ హల్‌చల్!

అశ్వారావుపేటలో ఆధార పార్టీ హల్‌చల్!

అశ్వారావుపేటలో ఆధార పార్టీ హల్‌చల్!
05-02-2026 43 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రధాన పార్టీలకు చెమటలు పట్టిస్తున్న ప్రచారం!

22 వార్డుల్లో పూర్తి అభ్యర్థులతో రాజకీయ దుమారం!

అశ్వారావుపేట :

మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ ప్రతిపాదన వెలువడిన నాటి నుంచి ఆధార పార్టీ అశ్వారావుపేట రాజకీయాన్ని షేక్ చేస్తోంది. ప్రధాన పార్టీలకు ఏమాత్రం తగ్గకుండా, మరింత ఉత్సాహంతో సాగుతున్న ప్రచారం ప్రత్యర్థి వర్గాల్లో స్పష్టమైన ఆందోళనను రేపుతోంది.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీలోని 22 వార్డులకుగాను ఆధార పార్టీ పూర్తి స్థాయిలో అభ్యర్థులను బరిలో దింపడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. బిఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులతో నేరుగా తలపడుతూ ఆధార పార్టీ అభ్యర్థులు ఇంటింటి ప్రచారంతో దూసుకుపోతున్నారు.ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రధాన పార్టీలలో ఓటమి భయం మొదలైందన్న చర్చ బలంగా వినిపిస్తోంది. పరిస్థితి చేయి దాటుతుందన్న అంచనాతో జిల్లా స్థాయి నాయకులను కూడా రంగంలోకి దించినట్లు విశ్వసనీయ సమాచారం.గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో ఆధార పార్టీపై ప్రజల నమ్మకం పెరుగుతుండటం ఆయా పార్టీల పెద్దలకు నిద్ర లేకుండా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆధార పార్టీకి వస్తున్న ఆదరణను జీర్ణించుకోలేక కొందరు నేతలు దుష్ప్రచారాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

అయితే ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, అదే ఆధార పార్టీకి బలంగా మారిందని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. అశ్వారావుపేట మున్సిపల్ రాజకీయాల్లో ఆధార పార్టీ ఇప్పుడు ప్రధాన శక్తిగా అవతరిస్తుందా అన్న చర్చ జోరుగా సాగుతోంది.

Sthanikam

అశ్వారావుపేటలో ఆధార పార్టీ హల్‌చల్!

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News