Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిలాద్‌ వేడుకల్లో ఐక్యత, సోదరభావం చాటిన సింగీతం ప్రజలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 03:04 AM

ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి – ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి

13-03-2026 83 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Medchal Malkajgiri incharge
Prabhakar

మల్కాజ్‌గిరి నియోజకవర్గ శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ (సిఐటియు) అల్వాల్ సర్కిల్ పరిధిలోని ఆశా వర్కర్లు కలిసి తమ సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఆశా వర్కర్లు మాట్లాడుతూ మహిళలు, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు ఆశా వర్కర్లుగా పనిచేస్తూ ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తున్నారని తెలిపారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఆశా వర్కర్ల వేతనాలు పెంచుతామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చినా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు దాటినా ఇప్పటివరకు ఆ హామీలు అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

అలాగే 50 లక్షల ఇన్సూరెన్స్, రూ.50 వేల అంత్యక్రియల సహాయం, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వంటి హామీలు అమలు చేయాలని కోరారు. పిఆర్సీ ఏరియర్స్, లెప్రసీ, పల్స్ పోలియో, ఎన్నికల డ్యూటీలకు సంబంధించిన బకాయిలు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ప్రతినెల అందాల్సిన పారితోషికాలు కూడా సకాలంలో అందకపోవడంతో ఆశా వర్కర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఈ సమస్యలన్నింటి పరిష్కారం కోసం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఎన్‌హెచ్‌ఎమ్‌కు నిధులు పెంచాలని ఆశా వర్కర్లు ఎమ్మెల్యేను కోరారు.

అదేవిధంగా వెంకటాపురం డివిజన్‌లోని సుభాష్ నగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రస్తుతం అద్దె భవనంలో పనిచేస్తోందని, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు ప్రభుత్వ భవనాలకు మారాల్సి వస్తే ఇంద్రానగర్ బస్ దవాఖాన లేదా మహిళా మండలికి మార్చాలని ఎమ్మెల్యే కోరారు.

ఈ విషయాన్ని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి వెంటనే మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా కలెక్టర్ మరియు డిఎంహెచ్ఓ డా. ఉమా గౌరి దృష్టికి తీసుకెళ్లగా, కలెక్టర్ తాత్కాలికంగా అదే భవనంలో కొనసాగేందుకు సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.

ఆశా వర్కర్ల సమస్యలను శ్రద్ధగా విన్న ఎమ్మెల్యే , వారి సమస్యలను తప్పనిసరిగా అసెంబ్లీలో మాట్లాడి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో సుభాష్ నగర్ యుబిఎస్‌సి డాక్టర్ నౌరిన్ బేగం, బి ఆర్ ఎస్ నాయకులు అనిల్ కిషోర్ గౌడ్,తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ (సిఐటియు) సభ్యులు ఉన్నికృష్ణన్, ఆశా వర్కర్లు కమల, కళ్యాణి, అమృత, జ్యోతి, వాగ్దేవి, కవిత, రూప, సంతోష, మీరా, సుగుణ, రాధ, రమ్యశ్రీ, ఆర్తి, ధృతి, లక్ష్మీ, రవళి, భవాని, కౌసల్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి – ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News