Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 12:24 AM

అసెంబ్లీ సాధనకు గ్రామాల నుంచే సంకల్పం నూతన సర్పంచులకు ఘన సన్మానం

25-02-2026 73 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: నియోజకవర్గ సాధన దిశగా గ్రామాల నుంచే ఉద్యమం ముమ్మరం చేయాలని రామన్నపేట నియోజకవర్గ సాధన సమితి పిలుపునిచ్చింది. మండలంలోని వివిధ గ్రామాలకు నూతనంగా ఎన్నికైన సర్పంచులను సమితి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా నీర్నెముల సర్పంచ్ కందిమల్ల గోపాల్ రెడ్డి, బోగారం సర్పంచ్ కూనూరు సాయికుమార్ గౌడ్, జనంపల్లి సర్పంచ్ బండ సరోజ, మునిపంపుల సర్పంచ్ బొడ్డుపల్లి వెంకటేశం, కుంకుడు పాముల సర్పంచ్ గొలుసుల సత్తయ్య, సూరారం సర్పంచ్ శ్రీనివాస్‌లను శాలువాలతో సత్కరించి అభినందించారు.

సమితి గౌరవాధ్యక్షులు రెబ్బలు రాములు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎర్ర రమేష్ గౌడ్ మాట్లాడుతూ… రాబోయే రోజుల్లో రామన్నపేటను అసెంబ్లీ కేంద్రంగా సాధించేందుకు అన్ని గ్రామాల సర్పంచులు ఏకగ్రీవంగా మద్దతు ఇవ్వాలని కోరారు. గ్రామపంచాయతీ స్థాయిలో తీర్మానాలు చేసి ప్రభుత్వానికి పంపించాలని, మండల పరిషత్ సమావేశాల్లో కూడా ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ఉద్యమాన్ని బలోపేతం చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో టీజేఎస్ మండల అధ్యక్షులు గడ్డం యాదగిరి, టిడిపి మండల అధ్యక్షులు ఎండి ఫజల్, కాంగ్రెస్ మండల నాయకులు కూనూరు కృష్ణ గౌడ్, బీఎస్పీ మండల అధ్యక్షులు నగరికంటి నరేష్, సిపిఐ మండల నాయకులు శ్రీ రామోజీ నరసింహాచారి, పెండెం రవీందర్, గంగాపురం వెంకటయ్య, ఎండి ఇమామ్ సాహెబ్, పోలగోని నర్సింహ్మ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

అసెంబ్లీ సాధనకు గ్రామాల నుంచే సంకల్పం నూతన సర్పంచులకు ఘన సన్మానం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News