Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:49 PM

ఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్ విఫలం: సీపీఎం

07-04-2026 33 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఎర్రుపాలెం, ఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీపీఎం నాయకులు మండిపడ్డారు. ఎర్రుపాలెం మండల కేంద్రంలోని ప్రజావాణి కార్యక్రమంలో అధికారులు వద్ద సీపీఎం పార్టీ నాయకులు వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు దివ్వెల వీరయ్య, మండల కార్యదర్శి మద్దాల ప్రభాకరరావు మాట్లాడుతూ... ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీ హామీలు ఇప్పటికీ అమలు కాలేదని విమర్శించారు. అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు కావస్తున్నా హామీల అమలులో నిర్లక్ష్యం ప్రదర్శించిందని ఆరోపించారు.

అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆరు గ్యారంటీల అమలుకు తగిన నిధులు కేటాయించలేదని పేర్కొన్నారు. ప్రతి మహిళకు నెలకు రూ.2,500 చొప్పున ఇస్తామని హామీ ఇచ్చినా అమలు కాలేదని, ఇప్పటివరకు ప్రతి మహిళకు సుమారు రూ.60,000 బకాయి పడిందని తెలిపారు.

పెన్షన్ల పెంపుపై కూడా ప్రభుత్వం వెనుకడుగు వేసిందని, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు రూ.4,000 పెన్షన్ ఇస్తామని చెప్పి ప్రస్తుతం రూ.2,000 మాత్రమే ఇస్తున్నారని విమర్శించారు. దివ్యాంగులకు రూ.6,000 పెన్షన్ హామీ కూడా అమలు కాలేదని తెలిపారు.

రైతు భరోసా, కౌలు రైతులకు ఆర్థిక సహాయం, రూ.2 లక్షల రుణమాఫీ వంటి కీలక హామీలకు బడ్జెట్‌లో ప్రస్తావన లేదని పేర్కొన్నారు. విద్యాభరోసా, నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్‌, విద్యార్థులకు స్కూటీలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి హామీలను విస్మరించిందని ఆరోపించారు.

ఉపాధి హామీ కూలీలు, ఆటో డ్రైవర్లకు వార్షిక ఆర్థిక సాయం, పెళ్లిళ్లకు బంగారం వంటి హామీలను కూడా ప్రభుత్వం అమలు చేయలేదని విమర్శించారు. ప్రచారం ఎక్కువగా చేసి అమలు తక్కువగా ఉన్న పాలన కొనసాగుతోందని అన్నారు.

ఇప్పటికైనా ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలుకు తగిన నిధులు కేటాయించి హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో కోటి సుబ్బారెడ్డి, దూదిగం బాసవయ్య, గామసు జోగయ్య, దివ్వెల వీరాంజనేయులు, సగ్గుర్తి వెంకటకృష్ణ, నక్క పుల్లారావు, షేక్ మస్తాన్, యాకూబ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్ విఫలం: సీపీఎం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News