Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:21 AM

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి
22-04-2026 51 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదగిరిగుట్ట: ఆర్టీసీని పూర్తిగా ప్రభుత్వంలో విలీనం చేసి కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల నిరవధిక సమ్మెలో భాగంగా యాదగిరిగుట్ట డిపో వద్ద కార్మికులకు సిపిఐ, ఏఐటీయూసీ నాయకులు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్టీసీని బలోపేతం చేసి ప్రజాసేవలో కీలకంగా నిలబెట్టాలని, కార్మికుల హక్కులను అమలు చేయాలని కోరారు.

కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేసి శాశ్వత ఉద్యోగ భద్రత కల్పించాలని, పెండింగ్‌లో ఉన్న వేతన సవరణలు, పిఆర్సీ బకాయిలను విడుదల చేయాలని, నియామక తేదీలను ప్రకటించాలని, యూనియన్లను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ బస్సులను రద్దు చేసి కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు.

ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కమిటీ సభ్యులు గోద శ్రీరాములు, జిల్లా సహాయ కార్యదర్శి బోలగాని సత్యనారాయణ, జిల్లా కార్యవర్గ సభ్యులు కళ్ళేం కృష్ణ, ఎండీ ఇమ్రాన్, కొల్లూరి రాజయ్య, పెరబోయిన మహేందర్, గోరేటి రాములు, కల్లేపల్లి మహేందర్, పెరబోయిన బంగారి, సామల భాస్కర్, ఆర్టీసీ జేఏసీ నాయకులు మంగ, ప్రభాకర్ రెడ్డి, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News