Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:22 AM

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు డివైఎఫ్ఐ మద్దతు

23-04-2026 126 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు నిర్వహిస్తున్న సమ్మెకు డివైఎఫ్ఐ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. గురువారం నల్గొండలో జరిగిన డివైఎఫ్ఐ ముఖ్య కార్యకర్తల సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లం మహేష్ ఈ మేరకు వెల్లడించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసినప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి Revanth Reddy మద్దతు తెలిపి, వారి సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. అయితే ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను అమలు చేయకపోవడం దురదృష్టకరమని విమర్శించారు.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని, అలాగే ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వం స్వయంగా కొనుగోలు చేసి నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికులు కొత్తగా ఎలాంటి డిమాండ్లు చేయడం లేదని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని మాత్రమే కోరుతున్నారని తెలిపారు.

ప్రభుత్వం తక్షణమే స్పందించి కార్మికుల సమస్యలను పరిష్కరించి సమ్మెను విరమింప చేయాలని కోరారు. భవిష్యత్తులో కార్మికుల హక్కుల కోసం జరిగే పోరాటాలకు డివైఎఫ్ఐ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు గుండాల నరేష్, జిల్లా సహాయ కార్యదర్శి కట్ట లింగస్వామి, జిల్లా కమిటీ సభ్యులు పోకల శశిధర్, నాయకులు బాలరాజు, ఆంజనేయులు, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు డివైఎఫ్ఐ మద్దతు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News