Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 02:38 AM

ఆర్జలభావి కొనుగోలు కేంద్రం సందర్శనకు బీజేపీ బృందం సిద్ధం

07-04-2026 40 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ: ఆర్జలభావి వడ్ల కొనుగోలు కేంద్రాన్ని బీజేపీ బృందం త్వరలో సందర్శించనుందని పార్టీ జిల్లా అధ్యక్షుడు డా. నాగం వర్షిత్ రెడ్డి తెలిపారు.

జిల్లాలో వరి కోతలు మార్చి మొదటి వారం నుంచే ప్రారంభమైనప్పటికీ కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ఆలస్యమవుతోందని ఆయన విమర్శించారు. అనేక ప్రాంతాల్లో ధాన్యం రాశులు పేరుకుపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

IKP, PACS ఆధ్వర్యంలోని కొనుగోలు కేంద్రాలు ఆలస్యంగా ప్రారంభమవుతున్నాయని, తూకం యంత్రాలు, బస్తాల సరఫరా ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదని పేర్కొన్నారు. మిల్లులకు ట్యాగింగ్ ప్రక్రియ ఆలస్యం కావడంతో రైతులు తమ పంటను విక్రయించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

ఈ పరిస్థితిని కొందరు రైస్ మిల్లర్లు ఉపయోగించుకొని రైతుల నుండి తక్కువ ధరలకు ధాన్యం కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. పాలకులు, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

ఉమ్మడి నల్గొండ జిల్లాలో 1066 కొనుగోలు కేంద్రాలు ఉండగా, అందులో వంద కూడా ప్రారంభం కాలేదని తెలిపారు. రైతులకు న్యాయం జరిగే వరకు బీజేపీ తరఫున పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Sthanikam

ఆర్జలభావి కొనుగోలు కేంద్రం సందర్శనకు బీజేపీ బృందం సిద్ధం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News