Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

అప్పుల భారంతో చేనేత కార్మికుడి ఆత్మహత్య

Updated : 10 Mar 2026 23:36 IST
As Preferred Source 1 min read
అప్పుల భారంతో చేనేత కార్మికుడి ఆత్మహత్య

పనిలేక అప్పుల ఒత్తిడి.. చేనేత కార్మికుడి ఆత్మహత్య

రామన్నపేట,

అప్పుల భారాన్ని తట్టుకోలేక చేనేత కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన రామన్నపేట మండలంలోని వెల్లంకి గ్రామంలో చోటుచేసుకుంది.

పోలీసుల వివరాల ప్రకారం.. వెల్లంకి గ్రామానికి చెందిన మిర్యాల బాలరాజు (39) చేనేత పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతనికి భార్య అంజలి, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. చేనేత పనుల కోసం ఐదేళ్ల క్రితం భువనగిరిలోని ఫైవ్ స్టార్ ఫైనాన్స్ సంస్థలో రూ.3.50 లక్షలు అప్పు తీసుకున్నాడు.

గత రెండు నెలలుగా చేనేత పనులు లేకపోవడంతో ఆదాయం తగ్గిపోయింది. దీంతో ఈఎంఐలు చెల్లించలేకపోయాడు. అప్పుల ఒత్తిడితో తీవ్ర మనస్థాపానికి గురైన బాలరాజు మంగళవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి భార్య అంజలి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ నాగరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Sthanikam

అప్పుల భారంతో చేనేత కార్మికుడి ఆత్మహత్య

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి