Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 12:25 AM

అప్పుల బారిన గ్రామ పంచాయతీలు… నిధుల్లేక అభివృద్ధి కుదరదన్న సిపిఎం

24-02-2026 42 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సిపిఎం జిల్లా కార్యదర్శి జహంగీర్

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామపంచాయతీలకు కనీసం నిధులు కేటాయించకుండా కాలయాపన చేస్తే గ్రామాల అభివృద్ధి ఎలా సాధ్యమని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ విమర్శించారు.వెల్లంకి గ్రామంలో రఘరామ ఫంక్షన్ హాల్ లో జరిగిన సిపిఎం మండల రాజకీయ శిక్షణ తరగతులు రెండవ రోజు సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన జహంగీర్ మాట్లాడుతూ గత రెండున్నర సంవత్సరాల నుండి గ్రామపంచాయతీలకు పైసా విదల్చకపోవడంతో గ్రామాల్లో అభివృద్ధి కొంటుబడి పోయిందని అన్నారు.ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించి చేతులు దులుపుకుంటే ఎలా అని ఎద్దేవా చేశారు.కనీసం గ్రామపంచాయతీ కార్మికులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో గ్రామపంచాయతీలు కాలమెల్ల తీస్తున్నాయని నూతనంగా ఎన్నికైన సర్పంచులు లక్షల రూపాయలు తమ చేతుల్లో నుండి ఖర్చు పెడుతూ అప్పుల పాలవుతున్నారని వాపోయారు. గ్రామ సీమలే దేశానికి పట్టుకొమ్మలు అన్న విషయాన్ని కేంద్రంలో ఉన్న బిజెపి రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ విస్మరిస్తున్నాయని అన్నారు.

15వ ఆర్ధిక సంఘం నిధులు పూర్తి స్థాయిలో విడుదల చేయటంలో కేంద్రంలో ఉన్న బీజేపీ నిర్లక్యం సరికాదాన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాబోయే బడ్జెట్ లో గ్రామాలకు ప్రత్యేక నిధులు కేటాయించాలని అన్నారు.ఇప్పటికే పారిశుధ్యం పడకేసి ప్రజా ఆరోగ్యం నిర్వీర్యం అవుతుందని ఎన్నికలు నిర్వహించి అభివృద్ధికి నిధులు కేటాయించకుండా కాలయాపన చేయటం సరికాదని అన్నారు.గ్రామ పంచాయతి కార్మికులకు సకాలంలో వేతనాలు చెల్లించకపోవడంతో ఇల్లు గడవని పరిస్థితి నెలకొన్నదని, గత 5 సంవత్సరాలుగా నూతన పింఛన్ ఇవ్వకపోవడంతో గ్రామాల్లో అనేక మంది వృద్దులు,వికలాంగులు,వితంతువులు గ్రామ పంచాయతి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని అన్నారు.నెలల తరబడి కనీసం కరెంట్ బిల్లులు కట్టలేని దీన స్థితిలో గ్రామ పంచాయతీలు ఉన్నాయని అన్నారు. వెంటనే గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయించి గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని అన్నారు.ఈ కార్యక్రమంలోరైతు సంఘం జిల్లా అధ్యక్షులు మేక అశోక్ రెడ్డి,జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జల్లెల పెంటయ్య, మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం,జిల్లా కమిటీ సభ్యులు బల్గురి అంజయ్య,వనం ఉపేందర్,మండల కార్యదర్శి వర్గ సభ్యులు కూరెళ్ళ నర్సింహా చారి, బోయిని ఆనంద్, జంపాల అండాలు, కందుల హనుమంతు, కల్లూరి నగేష్,మండల కమిటి సభ్యులు ఆవనగంటి నగేష్, గన్నేబోయిన విజయభాస్కర్, గాదె నరేందర్,గొరిగే సోములు, వేముల సైదులు,బావండ్లపల్లి బాలరాజు, నీల ఐలయ్య, బోడిగే రజిత, ఎండీ రషీద్, తొలుపునూరి శ్రీనివాస్, దుబ్బాక సర్పంచ్ గట్టు నర్సింహా, మేడబోయిన శ్రీనివాస్, ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షుడు గంటెపాక శివ కుమార్, పులి బిక్షం, మునికుంట్ల లెనిన్, తాళ్లపల్లి జితేందర్, పావిరాల మత్యగిరి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

అప్పుల బారిన గ్రామ పంచాయతీలు… నిధుల్లేక అభివృద్ధి కుదరదన్న సిపిఎం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News