Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 01:34 AM

ఆపదలో ఆదుకుని… ఆస్తి కాపాడిన 108 సిబ్బంది

04-04-2026 293 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కుత్బుల్లాపూర్/జీడిమెట్ల:

ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడమే కాకుండా, బాధితుడి విలువైన వస్తువులను సురక్షితంగా అప్పగించి 108 అంబులెన్స్ సిబ్బంది తమ నిజాయితీని మరోసారి చాటుకున్నారు.

ఘటన వివరాలు: నిజామాబాద్ జిల్లాకు చెందిన శివ ప్రసాద్ గౌడ్ శనివారం సుచిత్ర నుంచి మేడ్చల్ వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, జీడిమెట్ల గ్రామ పరిధిలోని గాంధీ విగ్రహం వద్ద వాహనం అదుపుతప్పి కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి.

సమాచారం అందుకున్న వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది—ఈఎంటీ (EMT) రాజు, పైలట్ నవీన్—బాధితుడికి ప్రథమ చికిత్స అందించి సమీప ఆసుపత్రికి తరలించారు.

నిజాయితీకి నిదర్శనం: బాధితుడి వద్ద ఉన్న బంగారు గొలుసు, వెండి బ్రాస్‌లెట్, రెండు మొబైల్ ఫోన్లు, సుమారు రూ.2 లక్షల నగదును అంబులెన్స్ సిబ్బంది భద్రపరిచారు. అనంతరం ఆసుపత్రికి చేరుకున్న బాధితుడి స్నేహితులను పిలిపించి, వారి సమక్షంలో ఆ నగదు, వస్తువులను క్షేమంగా అప్పగించారు.

ప్రాణాలను కాపాడటంతో పాటు లక్షల విలువైన ఆస్తిని కూడా సురక్షితంగా అందజేసిన పైలట్ నవీన్, ఈఎంటీ రాజుల నిజాయితీని బాధితుడి స్నేహితులు, స్థానికులు ప్రశంసించారు.

Sthanikam

ఆపదలో ఆదుకుని… ఆస్తి కాపాడిన 108 సిబ్బంది

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News