Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 01:39 AM

అనాథలైన చిన్నారులకు ఆర్థిక భరోసా… ముందుకొచ్చిన పూర్వ విద్యార్థులు

07-04-2026 52 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలం లోని సిరిపురం గ్రామానికి చెందిన మాండ్ర మల్లేష్ అనారోగ్యంతో మరణించడంతో ఆయన కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో పూర్వ విద్యార్థులు ఆదర్శంగా ముందుకొచ్చారు. ZPHS సిరిపురం 1996–97 బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థులు మల్లేష్ కుటుంబానికి అండగా నిలుస్తూ, ఆయన ఇద్దరు కుమార్తెల భవిష్యత్తు కోసం చెరి రూ.50 వేల చొప్పున మొత్తం రూ.1 లక్షను ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో అందించారు.

కుటుంబ పెద్దను కోల్పోయి ఆవేదనలో ఉన్న చిన్నారులకు భరోసా కల్పిస్తూ “మేమున్నాం” అని చేయూతనివ్వడం హృదయానికి హత్తుకునే ఘటనగా గ్రామస్థులు అభిప్రాయపడ్డారు. సామాజిక బాధ్యతను గుర్తించి పూర్వ విద్యార్థులు చేసిన ఈ సహాయం ఇతరులకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

ఈ సహాయక కార్యక్రమంలో మొగిలి శ్రీనివాస్, సిల్వేరు ఉపేందర్, బెల్లంకొండ నగేష్, సంగిశెట్టి భాస్కర్, కంకల మల్లేష్, సంగిశెట్టి రమేష్, బెల్లంకొండ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

అనాథలైన చిన్నారులకు ఆర్థిక భరోసా… ముందుకొచ్చిన పూర్వ విద్యార్థులు

Article Image

రామన్నపేట మండలం లోని సిరిపురం గ్రామానికి చెందిన మాండ్ర మల్లేష్ అనారోగ్యంతో మరణించడంతో ఆయన కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో పూర్వ విద్యార్థులు ఆదర్శంగా ముందుకొచ్చారు. ZPHS సిరిపురం 1996–97 బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థులు మల్లేష్ కుటుంబానికి అండగా నిలుస్తూ, ఆయన ఇద్దరు కుమార్తెల భవిష్యత్తు కోసం చెరి రూ.50 వేల చొప్పున మొత్తం రూ.1 లక్షను ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో అందించారు.

కుటుంబ పెద్దను కోల్పోయి ఆవేదనలో ఉన్న చిన్నారులకు భరోసా కల్పిస్తూ “మేమున్నాం” అని చేయూతనివ్వడం హృదయానికి హత్తుకునే ఘటనగా గ్రామస్థులు అభిప్రాయపడ్డారు. సామాజిక బాధ్యతను గుర్తించి పూర్వ విద్యార్థులు చేసిన ఈ సహాయం ఇతరులకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

ఈ సహాయక కార్యక్రమంలో మొగిలి శ్రీనివాస్, సిల్వేరు ఉపేందర్, బెల్లంకొండ నగేష్, సంగిశెట్టి భాస్కర్, కంకల మల్లేష్, సంగిశెట్టి రమేష్, బెల్లంకొండ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News