Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 02:37 AM

అన్నదాతల ఆక్రందనలు పట్టని పాలకులు – అశోక్ రెడ్డి

11-04-2026 54 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: దేశానికి అన్నం పెట్టే రైతులు పాలకుల అసమర్థ విధానాల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్ రెడ్డి అన్నారు. అఖిల భారత కిసాన్ సభ (AIKS) ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రైతు సంఘం జెండాను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు దేశానికి వెన్నుముక అయినప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని విమర్శించారు. వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉందని, కార్పొరేట్లకు అనుకూలంగా పాలకులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేసి పంటలకు గిట్టుబాటు ధరను చట్టబద్ధం చేయాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలు పరిష్కరించాలంటే వారు సంఘటితంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

అఖిల భారత కిసాన్ సభ స్వాతంత్ర్యోద్యమ కాలంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప చరిత్ర కలిగిన సంస్థ అని గుర్తుచేశారు.

ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల నాయకులు బోయిని ఆనంద్, గన్నబోయిన విజయభాస్కర్, భావండ్లపల్లి బాలరాజు, తాడూరి కృష్ణయ్య, కందుల మల్లారెడ్డి, బల్గూరి అంజయ్య, కొమ్ము అంజయ్య, అప్పం సురేందర్, వేముల సైదులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

అన్నదాతల ఆక్రందనలు పట్టని పాలకులు – అశోక్ రెడ్డి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News