Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 02:48 AM

అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా నల్ల జెండాలతో నిరసన

10-03-2026 34 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

అమెరికా సామ్రాజ్యవాద విధానాలను నిరసిస్తూ భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్‌ఐ), భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో నల్లగొండలోని సుభాష్ సెంటర్ వద్ద నల్ల జెండాలతో నిరసన కార్యక్రమం చేపట్టారు.

ఈ సందర్భంగా డివైఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లం మహేష్, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఖమ్మంపాటి శంకర్ మాట్లాడుతూ అమెరికా సామ్రాజ్యవాద విధానాలు ప్రపంచంలో యుద్ధాలను ప్రోత్సహిస్తూ దేశాలను వలసల పాలనలోకి నెట్టే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపించారు. ఇరాన్‌పై దాడులకు ఇజ్రాయిల్‌ను అమెరికా ప్రోత్సహిస్తోందని, ఈ యుద్ధాల కారణంగా వేలాది చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే యుద్ధాలను నిలిపివేసి ప్రపంచ శాంతిని కాపాడాలని డిమాండ్ చేశారు. అలాగే మోడీ ప్రభుత్వం సామ్రాజ్యవాద శక్తులకు మొగ్గుచూపుతున్న తీరు ఖండనీయమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ గర్ల్స్ రాష్ట్ర కో-కన్వీనర్ కుంచెం కావ్య, డివైఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు గుండాల నరేష్, ఎస్‌ఎఫ్‌ఐ డివిజన్ కార్యదర్శి మారుపాక కిరణ్, రియాజ్, మాజీ డివైఎఫ్‌ఐ నాయకులు మన్నెం బిక్షం, మహేష్, తరుణ్, లక్ష్మణ్, శివ, ఉపేందర్, సత్యనారాయణ, యాదగిరి, రఘు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా నల్ల జెండాలతో నిరసన

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News