Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 02:39 AM

అమరజీవి నర్రా రాఘవరెడ్డి వర్ధంతి.. పోరాటాల పథం గుర్తుచేసిన సిపిఎం నేతలు

09-04-2026 191 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

వెలిమినేడు గ్రామంలో గురువారం అమరజీవి నర్రా రాఘవరెడ్డి 11వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మల్లం మహేష్, మండల మాజీ కార్యదర్శి అరూరి శ్రీనివాస్ మాట్లాడుతూ నర్రా రాఘవరెడ్డి ఫ్లోరైడ్ విముక్తి పోరాటం, ఎస్ఎల్బీసీ సొరంగం సాధనలో కీలక పాత్ర పోషించిన నాయకుడని పేర్కొన్నారు.

నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్ సమస్య నిర్మూలనపై ఆయనకు ఉన్న కట్టుదిట్టమైన సంకల్పమే ఎస్ఎల్బీసీ లిఫ్ట్ స్కీమ్ రూపుదిద్దుకునేందుకు దోహదపడిందన్నారు. నార్ల తాతారావును వెంటబెట్టుకుని అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావును కలిసి ప్రాజెక్టును లిఫ్ట్ ద్వారా పూర్తి చేయాలని సూచించిన విషయాన్ని గుర్తుచేశారు.

ప్రజా సమస్యల పరిష్కారంలో నిబద్ధతతో పనిచేసిన నర్రా రాఘవరెడ్డి, ఏ అంశాన్నైనా లోతుగా చర్చించి పరిష్కారం చూపే నాయకుడని కొనియాడారు. నేటి ప్రజాప్రతినిధులు కూడా ఆయనను ఆదర్శంగా తీసుకుని ప్రజల్లో మమేకమై పనిచేయాలని సూచించారు.

తన జీవితమంతా పోరాటాలతో గడిపినా ఆశయాలపై ఎప్పుడూ రాజీ పడలేదని, చివరి వరకు ప్రజల కోసం నిలబడిన మహనీయుడని పేర్కొన్నారు. అధికారులతో కూడా తెలుగు భాషలోనే మాట్లాడి, ప్రజలకు మాతృభాషలో సమాధానాలు ఇవ్వాలని చెప్పే నాయకుడని తెలిపారు.

నకిరేకల్ నియోజకవర్గంలో ఆరు సార్లు ఎమ్మెల్యేగా సేవలందించి, ప్రతి పెద్ద గ్రామంలో హైస్కూల్ నిర్మాణం, తాగునీరు, విద్యుత్ సమస్యల పరిష్కారానికి కృషి చేశారని గుర్తుచేశారు. ప్రజల అనారోగ్య సమయంలో స్వయంగా ముందుండి వైద్యం చేయించే నాయకత్వం ఆయనదేనని అన్నారు.

ఈ కార్యక్రమం సిపిఎం మండల కమిటీ సభ్యుడు పంది నరేష్ అధ్యక్షతన జరిగింది. ఇందులో మండల కమిటీ సభ్యులు నేలికంటి నర్సింహా, శాఖ కార్యదర్శులు అరూరి దుర్గయ్య, సూరకంటి మోహన్ రెడ్డి, అరూరి శంబయ్య, ఆడెపు రమేష్, మామిడి రాములు, బొంగు లక్ష్మి నరసింహ స్వామి, కందటి యాదిరెడ్డి, గోలి నరసింహ, వట్టిపల్లి యాదయ్య, ఎంపాల లచిరెడ్డి, బొంగు నరేందర్ తదితరులు పాల్గొన్నారు

Sthanikam

అమరజీవి నర్రా రాఘవరెడ్డి వర్ధంతి.. పోరాటాల పథం గుర్తుచేసిన సిపిఎం నేతలు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News