ఇంద్రపాలనగరం: గ్రామానికి చెందిన పబ్బు బాలమ్మ అకాల మరణం చెందడంతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. ఆమె మృతదేహానికి గ్రామ సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై బాలమ్మకు చివరి వీడ్కోలు పలికారు.
ఈ కార్యక్రమంలో మందడి విద్యాసాగర్ రెడ్డి, మంటి లింగస్వామి, రవ్వ నర్సింహా, ఈర్లపల్లి మల్లయ్య, పల్లపు దుర్గయ్య, గర్ధాస్ వెంకటేశం, రాధారపు మల్లేశం, పబ్బు నగేష్, గోళ్లేపల్లి యాదయ్య, సింగణబోయిన సత్యనారాయణ, కంబాలపల్లి శ్రీశైలం, ఈర్లపల్లి రమేష్, బోనగిరి వెంకటేష్, జిట్టబోయిన నరేందర్, బాజ నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి