Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నూతన బాధ్యతలు చేపట్టిన రాజు పటేల్‌కు ఘన స్వాగతం కష్టమే విజయానికి మార్గం.. వెస్టీజ్‌లో రాణించిన అజ్మీరా శర్వాణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 04, 2026 07:54 AM

ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం

ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం

ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం
April 11, 2026 03:27 PM 18 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Suryapet
Vikram Journalist

సూర్యాపేట నియోజకవర్గంలోని సూర్యాపేట మండలం ఇమాంపేట్ గ్రామంలో ఐకేపీ (ఇందిరా క్రాంతి పథకం) ఆధ్వర్యంలో శనివారం ఇమాంపేట్ సంఘబంధం-1, 2 ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సన్నాలు పండిస్తున్న రైతులను ప్రోత్సహించేందుకు క్వింటాకు రూ.500 బోనస్ అందిస్తున్నట్లు తెలిపారు. రైతులకు ఉచిత కరెంట్, రుణ మాఫీ, రైతు భరోసా, బోనస్ వంటి పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని పేర్కొన్నారు. తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్న ఏకైక ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రభుత్వమేనని అన్నారు. రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే తమ పంటను అమ్మాలని సూచించిన ఆయన, వాతావరణ పరిస్థితులు అనిశ్చితంగా ఉండటంతో కేంద్రాల వద్ద టార్పాలిన్లు అందుబాటులో ఉంచుకోవాలని నిర్వాహకులకు సూచించారు. ధాన్యం తేమ శాతం 17 లోపే ఉండాలని, బస్తా బరువు 41 కిలోలకే పరిమితం చేయాలని, ఈ విషయంలో రైతులను ఇబ్బంది పెట్టవద్దని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఇమాంపేట్ గ్రామ సర్పంచ్ నరిగే నాగేశ్వరి నాగరాజు, ఉప సర్పంచ్ చింత చైతన్య సతీష్, మాజీ సర్పంచ్ పాముల ఉపేందర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు నకిరేకంటి బాలకృష్ణ, అబ్దుల్ కరీం, వార్డ్ సభ్యులు మునగాల జ్యోతి సాలయ్య, రేగురి హరీష్, నకిరేకంటి మాధవి సురేందర్, నాశబోయిన స్వాతి రవి, నకిరేకంటి మానస సతీష్, మున్సిపల్ కౌన్సిలర్ బైరు శైలేందర్ గౌడ్, పట్టణ ఉపాధ్యక్షులు బైరు నాగరాజు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మహిళా సంఘం అధ్యక్షులు, వీఓలు, గ్రామ పెద్దలు, రైతులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News