Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:06 AM

అగ్నిప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి: ఫైర్ ఆఫీసర్ బి. శివాజీ

15-04-2026 159 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా (ఏప్రిల్ 14 నుంచి 20 వరకు) బుధవారం స్థానిక చౌటుప్పల్ బస్టాండ్‌లో ఆర్టీసీ సిబ్బంది, ప్రయాణికులకు అగ్నిప్రమాదాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.​​ఈ సందర్భంగా చౌటుప్పల్ అగ్నిమాపక కేంద్ర అధికారి బి. శివాజీ మాట్లాడుతూ, ఎండలు తీవ్రంగా ఉన్నందున వేసవి కాలంలో అగ్నిప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని హెచ్చరించారు. ముఖ్యంగా కాలిపోతున్న అగ్గిపుల్లలు, బీడీలు, సిగరెట్లు ఆర్పకుండా పారవేయడం వల్ల ఎండుగడ్డికి నిప్పు అంటుకుని, ఆ మంటలు సమీపంలోని భవనాలకు, హోటళ్లకు వ్యాపించే ప్రమాదం ఉందని వివరించారు. ​ప్రతి ఒక్కరూ అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది ప్రజలకు ప్రమాద నివారణోపాయాలను ప్రత్యక్షంగా వివరించారు. ఈ అవగాహన కార్యక్రమంలో ఎల్.ఎఫ్.ఎఫ్ జి. నగేష్, సిబ్బంది కె. శేఖర్, జి. నాగరాజు, ఎ. రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

అగ్నిప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి: ఫైర్ ఆఫీసర్ బి. శివాజీ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News