Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 02:38 AM

అంగన్వాడీల్లో పోషకాహారం, పరిశుభ్రతపై కలెక్టర్ దృష్టి

08-04-2026 55 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదగిరిగుట్ట, అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు. బుధవారం యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా సందర్శించి సేవల నిర్వహణను సమగ్రంగా పరిశీలించారు.

కేంద్రంలో నమోదు అయిన పిల్లల సంఖ్య, ప్రతిరోజూ హాజరయ్యే వారి వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన మెనూ ప్రకారం పిల్లలకు రుచికరమైన, నాణ్యమైన ఆహారం అందుతున్నదా అని విచారించారు. ఈ సందర్భంగా పిల్లలకు వడ్డించిన భోజనాన్ని స్వయంగా పరిశీలించి, ఆహార నాణ్యతతో పాటు పరిశుభ్రత ప్రమాణాలను తనిఖీ చేశారు. ఆహారం తయారీలో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సిబ్బందికి సూచించారు.

చిన్నారులపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొంటూ, రోజువారీగా నిర్వహించే విద్యా, వినోద కార్యక్రమాలపై వివరాలు తెలుసుకున్నారు. పిల్లలతో మాట్లాడి ఏబీసీడీలు చెప్పించగా వారి ప్రతిభను అభినందించారు. గర్భిణీలు, బాలింతలకు అందించే సేవలు సక్రమంగా ఉండేలా, వారికి అవసరమైన పోషకాహారం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

అంగన్వాడీ కేంద్రం పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

అంగన్వాడీల్లో పోషకాహారం, పరిశుభ్రతపై కలెక్టర్ దృష్టి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News