Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 01:39 AM

ఆదోనిలో కార్పొరేట్ స్కూళ్ల ముందస్తు అడ్మిషన్లపై చర్యలు తీసుకోండి: డీఎస్‌ఎఫ్

07-04-2026 50 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆదోని పట్టణంలో ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తూ ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని డెమొక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ (డీఎస్‌ఎఫ్) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు డీఎస్‌ఎఫ్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో సంఘం నాయకులు మాట్లాడారు.

ఈ సందర్భంగా డీఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ధనాపురం ఉదయ్, రాష్ట్ర కార్యదర్శి బాలు మాట్లాడుతూ... అకాడమిక్‌ సంవత్సరానికి ముందుగానే అడ్మిషన్లు చేపట్టడం నిబంధనలకు విరుద్ధమని తెలిపారు. తల్లిదండ్రులను మాయమాటలు చెప్పి అడ్మిషన్లు చేపడుతున్న కార్పొరేట్ పాఠశాలలపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్న విద్యాసంస్థల గుర్తింపును రద్దు చేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు పేర్కొన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారులు ఇప్పటికైనా స్పందించి ఇలాంటి అక్రమాలపై దృష్టి సారించాలని కోరారు.

ఇలాగే కొనసాగితే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్న పాఠశాలల ఎదుట నిరసనలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో డీఎస్‌ఎఫ్ నాయకులు మహేష్‌, అరవింద్‌, విక్రమ్‌, హనుమేష్‌, రమణ తదితరులు పాల్గొన్నారు

Sthanikam

ఆదోనిలో కార్పొరేట్ స్కూళ్ల ముందస్తు అడ్మిషన్లపై చర్యలు తీసుకోండి: డీఎస్‌ఎఫ్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News