Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 02:47 AM

ఆదోని ఆసుపత్రుల దుస్థితిపై మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ఆగ్రహం

10-03-2026 242 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

స్కానింగ్ కోసం గంటల తరబడి వేచిచూస్తున్న గర్భిణులు.. ఎమ్మెల్యే స్పందించాలని డిమాండ్

ఆదోని ప్రభుత్వ ఆసుపత్రుల దుస్థితిపై మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి ఉన్నప్పటికీ ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి మెరుగుపడకపోవడం బాధాకరమని సమితి రాష్ట్ర కార్యదర్శి ఎ. నూర్ అహ్మద్ పేర్కొన్నారు.

ఆదోని మహిళా శిశు ఆసుపత్రిలో స్కానింగ్ కోసం వందలాది గర్భిణులు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని ఆయన తెలిపారు. రద్దీ ఎక్కువగా ఉండటం, స్కానింగ్ యంత్రాల కొరత కారణంగా గర్భిణులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. పేదలుగా పుట్టడమే ఆ మహిళలు చేసిన పాపమా అని ఎమ్మెల్యేను ప్రశ్నించారు.

ఎమ్మెల్యేగా ఎన్నికై రెండేళ్లు అయినా ఆదోని పట్టణ సమస్యల పరిష్కారంలో పురోగతి కనిపించడం లేదని విమర్శించారు. అసెంబ్లీలో వంద శాతం హాజరు ఉన్న ఎమ్మెల్యే పార్థసారథి ఆదోని నియోజకవర్గంలో మాత్రం ప్రజలకు అందుబాటులో లేకపోవడం వల్ల అభివృద్ధి అందని ద్రాక్షగా మారిందని అన్నారు.

ఇప్పటికైనా ఎమ్మెల్యే పార్థసారథి చొరవ తీసుకుని ఆదోని నియోజకవర్గంలో పర్యటించి ప్రజా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఎమ్మెల్యే నిర్లక్ష్య పాలనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ , ముఖ్యమంత్రి N. చంద్రబాబు నాయుడు , మంత్రి నారా లోకేష్ల కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.

Sthanikam

ఆదోని ఆసుపత్రుల దుస్థితిపై మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ఆగ్రహం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News