Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:24 AM

ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా. సర్పంచ్ గోపాల్ రెడ్డి

24-04-2026 377 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: నీర్నంల గ్రామాన్ని మండలంలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉన్నానని సర్పంచ్ కందిమల్ల గోపాల్ రెడ్డి అన్నారు. గ్రామసభలో మాట్లాడిన ఆయన, తక్కువ కాలంలోనే పలు అభివృద్ధి పనులు చేపట్టామని వివరించారు.

ఎమ్మెల్యే వేముల వీరేశం సహకారంతో రూ.10 లక్షలతో రెండు సీసీ రోడ్లు నిర్మించామని, మరో రూ.10 లక్షలతో స్త్రీశక్తి భవనం పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. రహదారుల పక్కన ఉన్న పిచ్చి చెట్లను తొలగించి గ్రామాన్ని శుభ్రంగా మార్చామని చెప్పారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేస్తూ లబ్ధిదారులను ప్రోత్సహిస్తున్నామని, గ్రామంలోని నీటి ట్యాంకులను క్రమం తప్పకుండా శుభ్రపరుస్తున్నామని తెలిపారు. ప్రతి ఇంటికి తాగునీరు అందేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

గ్రామంలో స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేసి, చెత్త నిర్వహణను సక్రమంగా చేపడుతున్నామని, ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. దోమల నివారణకు ఫాగింగ్ నిర్వహిస్తున్నామని వివరించారు.

రైతులకు మార్కెట్ వద్ద నీటి సౌకర్యం కల్పించామని, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

త్వరలోనే నీర్నంలను ఆదర్శ గ్రామంగా నిలబెట్టేందుకు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Sthanikam

ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా. సర్పంచ్ గోపాల్ రెడ్డి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News