Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కోదాడ లో ట్రాఫిక్ సమస్యల నివారణ కు ఆపరేషన్ రోప్ 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 02, 2026 11:59 AM

అద్దంకి బైపాస్‌లో ఘోర ప్రమాదం – పది గొర్రెల మృతి, బాధిత కుటుంబానికి పరిహారం ఇవ్వాలని సీపీఎం డిమాండ్

అద్దంకి బైపాస్‌లో ఘోర ప్రమాదం – పది గొర్రెల మృతి, బాధిత కుటుంబానికి పరిహారం ఇవ్వాలని సీపీఎం డిమాండ్

అద్దంకి బైపాస్‌లో ఘోర ప్రమాదం – పది గొర్రెల మృతి, బాధిత కుటుంబానికి పరిహారం ఇవ్వాలని సీపీఎం డిమాండ్
April 23, 2026 12:16 PM 22 Views
Reporter
స్థానికం ప్రతినిధి : NALGONDA DISTRICT
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు

నల్లగొండ జిల్లా: అద్దంకి బైపాస్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో పది గొర్రెలు మృతి చెందగా, మరో ఐదు గొర్రెలు తీవ్రంగా గాయపడిన ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. జీవనాధారాన్ని కోల్పోయిన గొర్రెల కాపరి మన్నె కోటిలింగం కుటుంబాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని సీపీఎం పట్టణ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య డిమాండ్ చేశారు.

బుధవారం మధ్యాహ్నం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పెద్ద బండ ప్రాంతం నుండి గొర్రెలను మేపుకుంటూ అద్దంకి బైపాస్ దాటుతున్న సమయంలో, హైదరాబాదు నుండి మిర్యాలగూడ వైపు వెళ్తున్న డీసీఎం వాహనం అతివేగంగా వచ్చి రోడ్డు దాటుతున్న గొర్రెలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఘటనాస్థలంలోనే పది గొర్రెలు మృతి చెందగా, మరో ఐదు గొర్రెలు గాయాలపాలయ్యాయి. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే సీపీఎం నాయకులు అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. బాధిత గొర్రెల కాపరి మన్నె కోటిలింగాన్ని పరామర్శించి ఓదార్చారు. ఈ ఘటనలో సుమారు మూడు లక్షల రూపాయల మేర నష్టం వాటిల్లిందని వారు తెలిపారు. రోజువారీ జీవనాధారం పూర్తిగా గొర్రెలపైనే ఆధారపడి ఉన్న కోటిలింగం కుటుంబం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా దండెంపల్లి సత్తయ్య మాట్లాడుతూ, అద్దంకి బైపాస్‌లో రోడ్డు భద్రతా సదుపాయాలు లేకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయని విమర్శించారు. ముఖ్యంగా రాత్రివేళల్లో వాహనాలు అధిక వేగంతో సంచరిస్తుండటంతో ప్రమాదాల సంఖ్య పెరుగుతోందని అన్నారు. వెంటనే రోడ్డు భద్రత అధికారులు స్పందించి, అద్దంకి బైపాస్‌పై రేడియం లైట్లు, హెచ్చరిక సిగ్నల్స్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా, ఎఫ్‌సీఐ పెద్ద బండ ప్రాంతం నుండి వ్యవసాయ పొలాల వైపు వెళ్లే మార్గంలో అండర్‌పాస్ నిర్మాణం చేయడం ద్వారా ఇలాంటి ప్రమాదాలను నివారించవచ్చని సూచించారు. గ్రామీణ ప్రజలు, గొర్రెల కాపరులు రోడ్డు దాటే సమయంలో సురక్షిత మార్గాలు లేకపోవడం ప్రధాన సమస్యగా ఉందని పేర్కొన్నారు.

ప్రమాదంలో నష్టపోయిన మన్నె కోటిలింగం కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం అందించాలని, గాయపడిన గొర్రెలకు వైద్య చికిత్స అందించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు సీపీఎం పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో పెద్ద బండ ప్రాంత టీఆర్ఎస్ నాయకులు ముక్కముల వెంకన్న, సీపీఎం నాయకులు మన్నె శంకరయ్యతో పాటు రైతులు, గొర్రెల కాపరులు ముక్కముల లింగయ్య, జక్కల కృష్ణ, దొడ్డోని శ్రావణ్, గోగుల మల్లయ్య, కర్నాటి లక్ష్మీనారాయణ, నల్లబోతు రవి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News