Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:39 AM

అంబేద్కర్ జయంతి ర్యాలీ ఘటన – పోలీసులపై ఆరోపణలు అసత్యం: డీఎస్పీ నరసింహప్ప

15-04-2026 41 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Somandepalli
Prakash

సత్యసాయి జిల్లా, ఏప్రిల్ 15: అంబేద్కర్ జయంతి సందర్భంగా కనగానపల్లి మండలం కొండపల్లి గ్రామంలో నిర్వహించిన ర్యాలీ నేపథ్యంలో పోలీసులపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమని పెనుకొండ డీఎస్పీ, ధర్మవరం ఇన్‌చార్జ్ డీఎస్పీ నరసింహప్ప తెలిపారు.

ఎస్సీ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీకి గ్రామంలోని సున్నిత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ముందస్తుగా బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. ర్యాలీ ప్రశాంతంగా సాగేందుకు సీఐ, ఎస్ఐలు మరియు సిబ్బందిని విధుల్లో నియమించామని చెప్పారు.

ఈ క్రమంలో సాయంత్రం సమయంలో గ్రామానికి చెందిన న్యాయవాది కె. చంద్రశేఖర్ రెడ్డి కొంతమందితో కలిసి ర్యాలీకి అడ్డంకులు సృష్టించారని తెలిపారు. ఆయన దూకుడుగా ప్రవర్తిస్తూ పోలీసు సిబ్బందిని తోసిపుచ్చడంతో పాటు విధి నిర్వహణకు ఆటంకం కలిగించారని పేర్కొన్నారు. ఈ తోపులాటలో ఆయనకు స్వల్ప గాయం అయినట్లు తెలిపారు.

పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చేందుకు ఆయనను పోలీస్ స్టేషన్‌కు తరలించి, అనంతరం కేసు నమోదు చేసి నోటీసు ఇచ్చి అదే రాత్రి విడుదల చేసినట్లు వివరించారు. ర్యాలీ అనంతరం ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా విజయవంతంగా ముగిసినట్లు పేర్కొన్నారు.

అయితే అనంతరం సోషల్ మీడియాలో విడుదల చేసిన వీడియోలో “పోలీసులు కొట్టారు, రూ.3 లక్షలు లాక్కొన్నారు” అంటూ చేసిన ఆరోపణలు పూర్తిగా తప్పుడు ప్రచారమని డీఎస్పీ స్పష్టం చేశారు. వాస్తవాలను వక్రీకరించి న్యాయవాదుల వర్గాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం జరిగిందని అన్నారు.

ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతోందని, ప్రజలు సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దని డీఎస్పీ నరసింహప్ప విజ్ఞప్తి చేశారు.

— పెనుకొండ సబ్-డివిజన్ పోలీస్ కార్యాలయం

Sthanikam

అంబేద్కర్ జయంతి ర్యాలీ ఘటన – పోలీసులపై ఆరోపణలు అసత్యం: డీఎస్పీ నరసింహప్ప

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News