Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ తిరుమల గ్రూపు ఆధ్వర్యంలో దేవి శరన్నవరాత్రి వేడుకలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 12, 2026 08:25 PM

అంబటి రాంబాబు, జగన్ సీఎం చంద్రబాబుకు క్షమాపణ చెప్పాలి: టిడిపి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలు గద్దె. అనురాధ

01-02-2026 51 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Krishna District
A Arunkumar

వైకాపా నేత అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలుసభ్యసమాజంతలదించుకునేలా ఉన్నాయని ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షులురాలు గద్దె అనురాధ తీవ్రంగా ఖండించారు. బాధ్యతాయుత రాజకీయ నాయకుడిగా వ్యవహరించాల్సిన వ్యక్తి స్థాయి లేని వ్యక్తిగత దూషణలకు దిగడం, వైకాపా రాజకీయ సంస్కృతి ఎంత దిగజారిందో స్పష్టంగా చూపుతోందనిఆమెమండిపడ్డారు.ప్రజాస్వామ్యంలో విభేదాలు సహజమేనని, కానీ వ్యక్తిగత అవమానాలు, నీచ పదజాలంరాజకీయంగాఅంగీకరించదగినవి కావని గద్దె అనురాధ స్పష్టం చేశారు. అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలకు ముందు ఆయనే కాకుండా, వాటిని అడ్డుకోలేని వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.వైకాపా ఎదుర్కొన్న ఘోర పరాజయానికి ప్రజలను నిందించడం పూర్తిగా హాస్యాస్పదమని, ఆ పార్టీ పతనానికి పూర్తి బాధ్యత వైకాపా నాయకులదేనని ఆమె స్పష్టం చేశారు. వైకాపా ఓటమి ప్రతిపక్షాల కుట్ర వల్ల కాదని, అది పూర్తిగా వారి అహంకారం, అదుపు లేని మాటలు, ప్రజా వ్యతిరేక విధానాల ఫలితమని వ్యాఖ్యానించారు.ప్రజలను, వ్యవస్థలను, రాజ్యాంగబద్ధ సంస్థలను, వ్యక్తులను దూషిస్తూ మాట్లాడటమే రాజకీయ బలం అన్న భ్రమ వైకాపా నేతల్లో బలంగా చోటు చేసుకుందని, అదే వారి రాజకీయ పతనానికి మూలకారణమైందన్నారు. వైకాపాకు శత్రువు బయట ఎక్కడో లేడని, అద్దంలో చూసుకుంటేనే వారి అసలు శత్రువు కనిపిస్తాడనిఘాటుగావ్యాఖ్యానించారు.వైకాపా ఓటమి ఎన్నికల రోజున ప్రారంభం కాలేదని, 5 సంవత్సరాలవారి నాయకుల మాటల్లో, ప్రవర్తనలోనే మొదలైందని ఆమె అన్నారు. అహంకారం అసహనం దూషణలు ప్రజా వ్యతిరేకత పార్టీ పతనంఇదే వైకాపా రాజకీయ ప్రయాణమని గద్దె అనురాధ వివరించారు. ప్రజలు వైకాపాను తిప్పికొట్టలేదని, వైకాపా నాయకుల ప్రవర్తనే ప్రజలను తిప్పికొట్టేలా చేసిందని ఆమె స్పష్టం చేశారు. వైకాపా రాజకీయంగా ఓడిపోకముందే నైతికంగా పూర్తిగా పతనమైందని, నాయకుల దూషణలే ఆ పార్టీ రాజకీయ అంత్యక్రియలకు కారణమయ్యాయని తీవ్రంగా విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ఓటమి అనేది ఓటర్ల తీర్పు అయితే, వైకాపా ఓటమి మాత్రం వారి నాయకుల తప్పిదాలకు వచ్చిన శిక్షేనని గద్దె అనురాధ తేల్చి చెప్పారు.

Sthanikam

అంబటి రాంబాబు, జగన్ సీఎం చంద్రబాబుకు క్షమాపణ చెప్పాలి: టిడిపి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలు గద్దె. అనురాధ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News