PRINT TIME: May 26, 2026 01:53 PM
‘మీ రక్ష’పై అవగాహన. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి. ఏసిపి ఏ కృష్ణయ్య.
‘మీ రక్ష’పై అవగాహన. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి. ఏసిపి ఏ కృష్ణయ్య.
May 25, 2026 09:14 PM
21 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
“ఒక సీసీ కెమెరా.. వెయ్యి కళ్లతో సమానం”
హైదరాబాద్, ‘మీ రక్ష’ కార్యక్రమంలో భాగంగా చైతన్యపురి విద్యుత్‌నగర్ కమ్యూనిటీ హాల్‌లో ఆదివారం అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎల్‌బీనగర్ ఏసీపీ ఎ. కృష్ణయ్య, చైతన్యపురి ఇన్‌స్పెక్టర్ కె. సైదులు, ఎస్‌ఐ వి. ప్రభాకర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కాలనీ వాసులకు ‘మీ రక్ష’ కార్యక్రమం ప్రాధాన్యత, ప్రయోజనాలపై పోలీసులు అవగాహన కల్పించారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల నేరాల నియంత్రణలో కీలక పాత్ర ఉంటుందని పేర్కొంటూ “ఒక సీసీ కెమెరా.. వెయ్యి కళ్లతో సమానం” అని వివరించారు. కాలనీల్లో భద్రతను మరింత బలోపేతం చేసేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు.
సమావేశంలో కాలనీ నివాసితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి