అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్తను హత్య చేసిన భార్య – ముగ్గురు నిందితులు అరెస్ట్
అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్తను హత్య చేసిన భార్య – ముగ్గురు నిందితులు అరెస్ట్
Krishna
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పరిధిలో సంచలనం సృష్టించిన ముత్యం రెడ్డి హత్య కేసును పోలీసులు ఛేదించారు. గంగాపూర్ గ్రామానికి చెందిన బోర్ మోటార్ మెకానిక్ శంబనోల్లా ముత్యం రెడ్డి ఈ నెల 16వ తేదీ నుంచి కనిపించకుండా పోవడంతో, అతని భార్య శంబనోల్లా కల్పన 18వ తేదీన నారాయణఖేడ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో కల్పన ప్రవర్తనపై అనుమానం రావడంతో లోతుగా ఆరా తీయగా, ఆమెకు మానూర్ మండలం ఎల్గోయి గ్రామానికి చెందిన గైని పండరితో అక్రమ సంబంధం ఉన్నట్లు బయటపడింది.పోలీసులు గైని పండరిని అదుపులోకి తీసుకుని విచారించగా, కల్పన, పండరి మరియు అతని అన్న గైని విట్టల్ కలిసి ముత్యం రెడ్డిని హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. గత కొంతకాలంగా కల్పన, పండరి మధ్య సన్నిహిత సంబంధం కొనసాగుతుండగా, ఈ విషయం తెలుసుకున్న ముత్యం రెడ్డి భార్యను పలుమార్లు మందలించేవాడు. దీంతో తన అక్రమ సంబంధానికి భర్త అడ్డు వస్తున్నాడని భావించిన కల్పన, ప్రియుడు పండరితో కలిసి హత్యకు పథకం రచించింది.ఈ నెల 16న ముత్యం రెడ్డిని బోర్ మోటార్ స్టార్టర్ రిపేర్ పని ఉందని నమ్మించి పండరి తన పొలానికి తీసుకెళ్లాడు. అక్కడ ముందుగానే సిద్ధంగా ఉన్న గైని విట్టల్‌తో కలిసి తాడుతో మెడ బిగించి హత్య చేశారు. అనంతరం ముందే జేసీబీతో తవ్విన గుంతలో మృతదేహాన్ని పడేసి మట్టితో పూడ్చిపెట్టారు. కేసును ఛేదించిన పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్లు నారాయణఖేడ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ ఎస్సై శ్రీశైలం, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి