Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాధలో ఉన్న కుటుంబాలకు చిరుమర్తి అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 01:53 PM

కొరటికల్‌లో గంగాదేవి మహోత్సవం భక్తిశ్రద్ధలతో బోనాలు, భజనలు

కొరటికల్‌లో గంగాదేవి మహోత్సవం భక్తిశ్రద్ధలతో బోనాలు, భజనలు

కొరటికల్‌లో గంగాదేవి మహోత్సవం భక్తిశ్రద్ధలతో బోనాలు, భజనలు
May 25, 2026 08:14 PM 19 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నకిరేకల్,: నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం కొరటికల్ గ్రామంలో యాదవుల కులదైవమైన శ్రీ శ్రీ శ్రీ గంగాదేవి ఐదవ మహోత్సవ పండుగను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని యాదవ కులస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని బోనాలు, భజనలు, కళ్యాణ కార్యక్రమాలతో అమ్మవారిని వేడుకున్నారు.

భక్తులు గంగాదేవిని ప్రార్థిస్తూ పంటలు, పశువులు, కుటుంబాలు సుఖసంతోషాలతో ఉండాలని మొక్కులు పెట్టుకున్నారు. మహిళలు, యువకులు భక్తి గీతాలు పాడుతూ భజనలు చేయడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.

ఈ సందర్భంగా పెద్ద గొల్ల భీమనబోయిన లింగయ్య యాదవ్, సారగొల్ల నల్లమాద నాగేష్ యాదవ్ మాట్లాడుతూ గంగాదేవి ఆశీస్సులతో గ్రామ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు.

ఈ వేడుకల్లో గ్రామ సర్పంచ్ బంటు రవి, మాజీ ఎంపీటీసీ శ్రీలత కొండయ్య, భీమనబోయిన యాదగిరి యాదవ్, శంకర్ యాదవ్, అంజయ్య యాదవ్, గుండబోయిన దశరథ యాదవ్, దొడ్డబోయిన రాములు యాదవ్, ముచ్చబోయిన వెంకన్న యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News