Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సైబర్ నేరగాళ్ల సైలెంట్ ట్రాప్... అవగాహనతోనే ఆన్‌లైన్ మోసాలకు చెక్!-సీఐ మన్మధకుమార్ ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 06:39 PM

25 ఏళ్ల తర్వాత కలిసిన స్నేహాలు.. జ్ఞాపకాల సందడి

23-03-2026 231 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట,

దాదాపు 25 ఏళ్ల తర్వాత ఒకే చోట కలుసుకున్న పూర్వ విద్యార్థులు ఆనందంలో మునిగిపోయారు. రామన్నపేట మండల కేంద్రంలోని ఏవీఎం హై స్కూల్‌లో 2000–2001 విద్యాసంవత్సరంలో పదో తరగతి చదివిన విద్యార్థులు ఆదివారం స్థానిక అమృతవనంలో నిర్వహించిన పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ సిల్వర్ జూబ్లీ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఒకరి మంచి చెడులు ఒకరు తెలుసుకుంటూ ఆప్యాయంగా పలకరించుకున్నారు.

వారికి విద్యాబుద్ధులు నేర్పిన పూర్వ గురువులు ఉయ్యాల రాములు, గోపాల్ రెడ్డి, ఏదుల్ల లక్ష్మారెడ్డిలను శాలువాలతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.

దేశ విదేశాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులు ఒకే వేదికపై కలుసుకోవడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఈ సమ్మేళనం నిర్వహణకు శ్రమించిన నిర్వాహకులను అభినందించారు.

ఈ కార్యక్రమంలో మేడబోయిన ఉపేందర్, ఆవుల నరేందర్, గాదె సతీష్, గాదె రాము, నోముల చంద్రశేఖర్, నల్ల వెంకట్ రెడ్డి, ఆకవరపు ఉదయ్ కుమార్, అప్పం సంతోష్, కునూరు లింగస్వామి, గుమ్ముల నర్సిరెడ్డి, మహేష్, కవిత, ప్రీతీ, హేమలత, మమత, సత్య శ్రీ, రాపోలు శ్యాంసుందర్, కొండ వెంకటేశం, శివకుమార్, రేవణాల సత్యనారాయణ, శ్రీకారం మథిన్, ఎస్కే మహబూబ్ జానీ, సునీత తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

25 ఏళ్ల తర్వాత కలిసిన స్నేహాలు.. జ్ఞాపకాల సందడి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News