Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 01:26 PM

అంబుజా సిమెంట్ కంపెనీ రద్దు.. 29న విజయోత్సవ సభ

27-06-2026 58 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలో ప్రతిపాదించిన అంబుజా సిమెంట్ కంపెనీ రద్దు ప్రజల ఐక్య పోరాట విజయమని పర్యావరణ పరిరక్షణ వేదిక నాయకులు పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం రహదారి బంగ్లాలో నిర్వహించిన సమావేశంలో కన్వీనర్ జల్లెల పెంటయ్య, కో-కన్వీనర్ ఎండీ రెహాన్, ఊట్కూరు నరసింహ తదితరులు మాట్లాడారు.

ప్రజల విజయాన్ని పురస్కరించుకుని ఈ నెల 29న మధ్యాహ్నం 12 గంటలకు రహదారి బంగ్లాలో అభినందన సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని వెల్లడించారు. మండలంలోని అన్ని గ్రామాల నుంచి ప్రజలు, ప్రజాప్రతినిధులు, యువత, విద్యార్థులు, వ్యాపారులు, మేధావులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ఉద్యమకారులు పెద్ద సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

సమావేశంలో కందుల హనుమంతు, ఎండీ జమీరుద్దీన్, బత్తుల సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

అంబుజా సిమెంట్ కంపెనీ రద్దు.. 29న విజయోత్సవ సభ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News