Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మత్తుకు దూరంగా ఉంటేనే దేశ భవిష్యత్తు భద్రం: ​డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ఎం. సుమన్‌ కల్యాణ్‌ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 27, 2026 01:05 PM

28న సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభను విజయవంతం చేయాలి: గుమ్ముల మోహన్ రెడ్డి, మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి

28న సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభను విజయవంతం చేయాలి: గుమ్ముల మోహన్ రెడ్డి, మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి

28న సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభను విజయవంతం చేయాలి: గుమ్ముల మోహన్ రెడ్డి, మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి
June 27, 2026 01:54 AM 12 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

నల్గొండ, జూన్ 26 (ఉదయం): ఈ నెల 28న కనగల్ మండల కేంద్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనే అభివృద్ధి కార్యక్రమాలు, అనంతరం ఎన్జీ కళాశాలలో నిర్వహించే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు.

శుక్రవారం నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో సీఎం సభ విజయవంతంపై సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ ప్రజాప్రతినిధులు, బూత్ స్థాయి నాయకులు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.

అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సహకారంతో నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. మహిళల ఆర్థికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని, మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు అందజేస్తోందని చెప్పారు. సీఎం సభ చారిత్రాత్మకంగా నిలిచేలా పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని కోరారు.

పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి మాట్లాడుతూ, ఓటరు సవరణ కార్యక్రమం (SIR)పై పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బూత్ స్థాయి కార్యకర్తలు ప్రతి ఓటరును గుర్తించి సవరణ ప్రక్రియలో సహకరించాలని కోరారు.

ఈ నెల 28న ఎన్జీ కళాశాలలో జరిగే సభకు నల్గొండ నియోజకవర్గం నుంచి 60 వేల మందికి పైగా ప్రజలను సమీకరిస్తామని తెలిపారు. కనగల్ వద్ద రూ.13 వేల కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఆర్‌అండ్‌బీ హైబ్రిడ్ రోడ్ల పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారని, అలాగే రూ.250 కోట్లతో మెడికల్ కళాశాల నుంచి దుప్పలపల్లి వరకు నిర్మించే రహదారికి కూడా శంకుస్థాపన చేస్తారని చెప్పారు.

అదేవిధంగా, రూ.430 కోట్లతో ఎస్‌ఎల్‌బీసీ కాలువ లైనింగ్ పనులు కొనసాగుతున్నాయని, సీఎం నల్గొండ నియోజకవర్గానికి మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు ప్రకటించే అవకాశం ఉందని పేర్కొన్నారు. సభను ఘనవిజయం చేసి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రతిష్ఠను మరింత పెంచాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, తిప్పర్తి మాజీ జెడ్పీటీసీ పాశం రామ్ రెడ్డి మాట్లాడుతూ, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నల్గొండ అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని నిరంతరం పనిచేస్తున్నారని, సభ విజయవంతానికి ప్రతి నాయకుడు కృషి చేయాలని కోరారు.

ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్ మహమ్మద్ అష్రఫ్ అలీ అమేర్, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమేష్, మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మీ శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్లు ఆలకుంట నాగరత్నం రాజు, పాశం సంపత్ రెడ్డి, కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు, సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News