Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 01:30 PM

నలుగురి హత్య కేసును ఛేదించిన నల్గొండ పోలీసులు.. నలుగురు నిందితుల అరెస్ట్

27-06-2026 35 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ, జూన్ 27: నల్గొండ పట్టణంలోని తెలంగాణ కాలనీలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి దారుణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్లడించారు.

పోలీసుల వివరాల ప్రకారం, మృతురాలు హసీనా బంధువులైన తబస్సుం, ఆమె భర్త సయ్యద్ అస్లాం, అతని స్నేహితుడు మహమ్మద్ సోహైల్, బంగారం తాకట్టు స్వీకరించిన హేమంత్ కుమార్ కలిసి వ్యక్తిగత కక్షలు, ఆర్థిక ఇబ్బందులు, డబ్బు, బంగారు ఆభరణాల కోసం ఈ హత్యలకు పాల్పడ్డారు.

దర్యాప్తులో భాగంగా నిందితుల నుంచి మహీంద్రా మరాజో కారు, రూ.30.04 లక్షల నగదు, హత్యకు ఉపయోగించిన కత్తి, మూడు సెల్‌ఫోన్లు, ఐదు తులాల కరిగించిన బంగారు ముద్ద, భూమి మరియు బ్యాంకు పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.

హత్య వెనుక కుట్ర

ప్రధాన నిందితుడు సయ్యద్ అస్లాం తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో అప్పుల్లో కూరుకుపోయాడు. మృతురాలు హసీనా వద్ద అప్పు తీసుకున్న అతడు, మరోసారి డబ్బు అడగగా ఆమె నిరాకరించడంతో పాటు పాత అప్పు కూడా చెల్లించాలని ఒత్తిడి చేయడంతో కక్ష పెంచుకున్నాడు.

అదే సమయంలో హసీనా ఇంట్లో నగదు, బంగారం ఉన్నాయని తెలుసుకున్న అస్లాం, తన భార్య తబస్సుంతో కలిసి హత్య చేసి దోపిడీ చేయాలని పథకం రచించాడు. నేరానికి ముందు యూట్యూబ్‌లో హత్య చేసి తప్పించుకునే మార్గాలపై వీడియోలు కూడా చూసినట్లు పోలీసులు వెల్లడించారు.

అర్ధరాత్రి ఇంట్లోకి ప్రవేశించి హత్యలు

ఈ నెల 20వ తేదీ తెల్లవారుజామున ఇంట్లోకి చొరబడిన అస్లాం, మొదట హసీనాపై కత్తితో దాడి చేశాడు. అనంతరం అడ్డుకొచ్చిన భర్త సుల్తాన్, కుమారుడు ముజమ్మిల్‌ను హత్య చేశాడు. మంచం కింద దాక్కున్న 12 ఏళ్ల బాలిక అఫ్కూరాను సాక్ష్యం లేకుండా చేయాలనే ఉద్దేశంతో హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది.

నలుగురి మృతదేహాలపై చద్దర్లు కప్పి, ఇంటికి తాళం వేసి, బంగారం, నగదు, పత్రాలు తీసుకుని హైదరాబాద్‌కు పారిపోయాడు.

బంగారం తాకట్టు.. పోలీసుల వలలో నిందితులు

దోచుకున్న బంగారాన్ని తన స్నేహితుడు సోహైల్ సహాయంతో దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ జ్యువెలరీ దుకాణంలో తాకట్టు పెట్టి రూ.5.30 లక్షలు తీసుకున్నట్లు నిందితుడు అంగీకరించాడు.

సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాలు, ప్రత్యేక బృందాల దర్యాప్తుతో నార్కట్‌పల్లి ఫ్లైఓవర్ వద్ద నిందితులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు.

పోలీసు బృందానికి ఎస్పీ అభినందనలు

ఈ సంచలన కేసును కేవలం మూడు రోజుల్లో ఛేదించిన డీఎస్పీ కె. శివరాం రెడ్డి నేతృత్వంలోని ప్రత్యేక బృందం, సీఐలు, ఎస్సైలు, సీసీఎస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రత్యేకంగా అభినందిస్తూ రివార్డులు ప్రకటించారు.

Sthanikam

నలుగురి హత్య కేసును ఛేదించిన నల్గొండ పోలీసులు.. నలుగురు నిందితుల అరెస్ట్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News