Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 01:31 PM

కర్నూలు పర్యటనతో అభివృద్ధికి నాంది.. సీఎం చంద్రబాబుకు ప్రజల అభినందనలు: గడ్డా ఫక్రుద్దీన్

27-06-2026 50 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆదోని, కర్నూలు జిల్లాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండు రోజుల పర్యటన విజయవంతంగా సాగిందని, జొన్నగిరి గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు ప్రారంభోత్సవం, తుంగభద్ర ప్రాజెక్టు నూతన గేట్ల ప్రారంభం జిల్లాకు చారిత్రాత్మక ఘట్టాలని టీడీపీ ఏపీ రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యదర్శి గడ్డా ఫక్రుద్దీన్ అన్నారు.

శుక్రవారం ఆదోనిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి పర్యటనతో కర్నూలు జిల్లా అభివృద్ధికి కొత్త దిశ లభించిందన్నారు. జొన్నగిరిలో దేశంలోనే ప్రైవేట్ రంగంలో అతిపెద్ద గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు ప్రారంభం కావడం రాయలసీమ చరిత్రలో సువర్ణ అధ్యాయమని పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రాష్ట్రం మాత్రమే కాకుండా ఖనిజ సంపదకు నిలయమని ఈ ప్రాజెక్టు మరోసారి నిరూపించిందన్నారు. జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్ రాయలసీమ ఆర్థికాభివృద్ధికి గ్రోత్ ఇంజిన్‌గా మారుతుందన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యలు ప్రజల్లో కొత్త ఆశలు నింపాయని చెప్పారు.

తుంగభద్ర ప్రాజెక్టుకు 33 నూతన గేట్ల ఏర్పాటు పూర్తవడం రైతులకు శాశ్వత భరోసా కల్పించే నిర్ణయమని ఫక్రుద్దీన్ పేర్కొన్నారు. కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి సీఎం చంద్రబాబు ప్రారంభోత్సవంలో పాల్గొనడం మూడు రాష్ట్రాల సమన్వయానికి నిదర్శనమన్నారు.

సాగునీటి ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాలంటూ ముఖ్యమంత్రి చెప్పిన సందేశం ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన విషయమని అన్నారు. కేంద్ర సహకారం, మూడు రాష్ట్రాల సమిష్టి కృషితో కేవలం ఆరు నెలల్లో కొత్త గేట్లు ఏర్పాటు చేసి లక్షలాది మంది రైతులకు సాగునీటి భరోసా కల్పించడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని కొనియాడారు.

దాదాపు 70 ఏళ్ల చరిత్ర కలిగిన తుంగభద్ర ప్రాజెక్టుకు తొలిసారిగా గేట్లు మార్చడం చారిత్రాత్మక పరిణామమని, భవిష్యత్తులో కూడా మూడు రాష్ట్రాల పరస్పర సహకారంతో ప్రజలకు మరిన్ని ప్రయోజనాలు చేకూరాలని ఆకాంక్షించారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లాలో చేపట్టిన రెండు రోజుల పర్యటన విజయవంతంగా ముగియడం పట్ల జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని గడ్డా ఫక్రుద్దీన్ తెలిపారు.

Sthanikam

కర్నూలు పర్యటనతో అభివృద్ధికి నాంది.. సీఎం చంద్రబాబుకు ప్రజల అభినందనలు: గడ్డా ఫక్రుద్దీన్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News