Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 01:31 PM

షాపల్లి గ్రామ మహిళా కాంగ్రెస్ శాఖ అధ్యక్షురాలిగా కన్యబోయిన సంతోష్

27-06-2026 24 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ, జూన్ 27: నార్కెట్‌పల్లి మండలం షాపల్లి గ్రామ మహిళా కాంగ్రెస్ శాఖ అధ్యక్షురాలిగా గ్రామానికి చెందిన కన్యబోయిన సంతోష్ నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా కేంద్రంలో ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షురాలు శ్రావణి ఆమెకు నియామక పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా శ్రావణి మాట్లాడుతూ, ఐఎన్‌టీయూసీ జాతీయ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎరగని నాగన్న గౌడ్ ఆధ్వర్యంలో పార్టీ, యూనియన్ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.

నూతన అధ్యక్షురాలు కన్యబోయిన సంతోష్ మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షురాలు శ్రావణి, జాతీయ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎరగని నాగన్న గౌడ్, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాస్ నేత, అంబటి సోమన్నలకు కృతజ్ఞతలు తెలిపారు.

గ్రామంలోని కార్మికులు, మహిళలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు.

Sthanikam

షాపల్లి గ్రామ మహిళా కాంగ్రెస్ శాఖ అధ్యక్షురాలిగా కన్యబోయిన సంతోష్

Article Image

నల్గొండ, జూన్ 27: నార్కెట్‌పల్లి మండలం షాపల్లి గ్రామ మహిళా కాంగ్రెస్ శాఖ అధ్యక్షురాలిగా గ్రామానికి చెందిన కన్యబోయిన సంతోష్ నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా కేంద్రంలో ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షురాలు శ్రావణి ఆమెకు నియామక పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా శ్రావణి మాట్లాడుతూ, ఐఎన్‌టీయూసీ జాతీయ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎరగని నాగన్న గౌడ్ ఆధ్వర్యంలో పార్టీ, యూనియన్ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.

నూతన అధ్యక్షురాలు కన్యబోయిన సంతోష్ మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షురాలు శ్రావణి, జాతీయ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎరగని నాగన్న గౌడ్, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాస్ నేత, అంబటి సోమన్నలకు కృతజ్ఞతలు తెలిపారు.

గ్రామంలోని కార్మికులు, మహిళలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News